
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ క్రేజీ కాంబోలో పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత నుంచి కథ ఏంటి..? దీనికి ఏ టైటిల్ పెట్టనున్నారు..? అనే డిష్కసన్ స్టార్ట్ అయ్యింది. ఇటీవల ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ రెండు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు టైటిల్స్ కాదని.. మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే.. ఈ టైటిల్ వెనుక ఓ ట్విస్ట్ కూడా బయటకు వచ్చింది. ఇంతకీ.. బన్నీ, అట్లీ మూవీకి అనుకుంటున్న కొత్త టైటిల్ ఏంటి..? దీని వెనకున్న ట్విస్ట్ ఏంటి..?
ఈ భారీ, క్రేజీ మూవీకి ఐకాన్, సూపర్ అనే రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రెండు టైటిల్స్ లో ఐకాన్ అనే టైటిల్ తో ఇంతకు ముందే బన్నీ సినిమా చేయాలి. డైరెక్టర్ వేణు శ్రీరామ్ బన్నీకి కథ చెప్పడం.. కథ నచ్చడంతో సినిమాని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఐకాన్ మూవీకి కనపడడం లేదు అనేది ట్యాగ్ లైన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాలి. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ వార్తలకే పరిమితం అయ్యింది కానీ.. పట్టాలెక్కలేదు. ఇప్పుడు బన్నీ, అట్లీ మూవీకి ఐకాన్ అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. బన్నీ.. మలయాళం డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో సినిమా చేయబోతున్నాడని.. త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని ఈమధ్య న్యూస్ వైరల్ అయ్యింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్టుగా కూడా టాక్ వినిపించింది. అంతే కాకుండా ఈ సినిమాకి శక్తిమాన్ అనే టైటిల్ అనుకుంటున్నారని టైటిల్ కూడా లీకైంది. ఎందుకంటే.. మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ శక్తిమాన్ తరహా కథతో ఇంతకు ముందు సినిమా చేశాడు. ఇప్పుడు అంతకు మించి అనేలా ఈ కథను రెడీ చేశాడని తెలిసింది. అసలు ఈ కథతో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత బన్నీ దగ్గరకి వచ్చిందని టాక్.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బన్నీ, అట్లీ మూవీ కూడా సూపర్ హీరో తరహా కథతోనే రూపొందుతుంది. అందుచేత.. ఈ సినిమాకే శక్తిమాన్ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి అట్లీ ఇటీవల అప్ డేట్ ఇచ్చాడు. ఏం చెప్పాడంటే.. ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదట. ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదట. అలాగే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది కూడా ఇంకా నిర్ణయించలేదని.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని తెలియచేశాడు అట్లీ. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా శక్తిమాన్, ఐకాన్, సూపర్ హీరో ఈ మూడు టైటిల్స్ లో ఏదోటి ఫైనల్ చేస్తారో మరో టైటిల్ పెడతారో చూడాలి.