
వంశీ పైడిపల్లి.. టాలెంటెడ్ డైరెక్టర్. కొన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ అందించాడు. అయితే.. సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటాడు. సక్సెస్ ఇచ్చినా మరో సినిమా స్టార్ట్ చేయడానికి రెండు మూడేళ్లు పడుతుంది. కారణం ఏంటంటే.. స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలి అనుకుంటాడు వంశీ పైడిపల్లి. ఇప్పుడు స్టార్ హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. దీంతో హిట్ ఇచ్చినా చేతిలో సినిమా లేదు. ఇటీవల అమీర్ ఖాన్ తో వంశీ పైడిపల్లి సినిమా అంటూ ప్రచారం జరిగింది. త్వరలో అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్ వినిపించింది కానీ.. ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు అమీర్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ ఏమైంది..?
మున్నా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వంశీ పైడిపల్లి ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. టాలెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆతర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారసుడు చిత్రాలను తెరకెక్కించాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. అయితే.. కోలీవుడ్ స్టార్ విజయ్ తో తెలుగు, తమిళ్ లో తీసిన వారసుడు సినిమా మంచి విజయం సాదించింది. ఈ సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా… ఇంత వరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి ట్రై చేశాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాలి అనుకున్నారు.
అయితే.. అమీర్ ఖాన్ కు స్టోరీ లైన్ చెప్పడం… లైన్ బాగుంది.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పడం.. జరిగిందట కానీ.. ఫుల్ స్క్రిప్ట్ తో వంశీ మెప్పించలేకపోయాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందని వంశీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరో వైపు దిల్ రాజు కూడా వంశీకి ప్రాజెక్ట్ సెట్ చేయాలని ట్రై చేస్తున్నాడు కానీ.. కుదరడం లేదు. యావరేజ్ తీసిన డైరెక్టర్స్ కూడా ఏదో సినిమా చేస్తున్నారు.. ఖాళీగా ఉండడం లేదు. అలాంటిది హిట్ సినిమా తీసి కూడా ఖాళీ ఉంటున్నాడు వంశీ. స్టార్ హీరోలే కావాలనే పట్టుదలను వదిలి.. మీడియం రేంజ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తే.. వంశీ కెరీర్ లో ఇంత గ్యాప్ రాదు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి.. వంశీ రూటు మారుస్తాడో లేక స్టార్ హీరోలే కావాలని వెయిట్ చేస్తాడో చూడాలి.