విశ్వంభర విడుదల వెనుక ఏం జరుగుతోంది..?

మెగాస్టార్ చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత నటించిన సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ డైరెక్టర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడే జనవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ.. రాలేదు. ఆతర్వాత సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత జులైలో విశ్వంభర రావడం పక్కా అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఈసారి కూడా విశ్వంభర రావడం లేదనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అసలు విశ్వంభర విడుదల వెనుక ఏం జరుగుతోంది..? ఇంతకీ.. విశ్వంభర రిలీజ్ ఎప్పుడు..?

ఇది భారీ సోషియో ఫాంటసీ మూవీ. దీనిలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుచేత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఎక్కువుగా ఉంటుంది. ఆమధ్య ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో రీ వర్క్ చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని మెగాస్టార్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ కు చెప్పారట. దీంతో లేట్ అయినా ఫరవాలేదు.. క్వాలిటీ అదిరిపోవాలి.. ఆడియన్స్ కు వావ్ అనిపించేలా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందివ్వాలని టీమ్ ఫిక్స్ అయ్యారట. అందుకనే విశ్వంభర రిలీజ్ అనేది ఆలస్యం అవుతుంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. జులై 24న విశ్వంభర చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు. అందుకనే ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడం వలనే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అయితే.. ఇప్పుడు మళ్లీ రిలీజ్ ఎప్పుడు అనేది డౌట్ లో పడిందని టాక్. మేటర్ ఏంటంటే.. జులై 24న విశ్వంభర రావడం లేదట. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో పాటు.. రీషూట్ కూడా చేయాల్సివుందట. అందుకనే మరోసారి వాయిదా తప్పదని టాక్. ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారనే టాక్ తో పాటు… ఈ సంవత్సరంలో రిలీజ్ కాకపోవచ్చు.. నెక్ట్స్ ఇయర్ లో రిలీజ్ ఉండచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. మరి.. త్వరలో విశ్వంభర రిలీజ్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.