బన్నీ, అమీర్ ఖాన్ సినిమా సీక్రెట్ ఇదే.!

AlluAjun and Aamir Khan’s movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 సినిమాలతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాడో తెలిసిందే. ఈ రెండు సినిమాలతో బన్నీ రేంజే మారిపోయింది. అందుకనే బన్నీతో సినిమా చేయడం కోసం బాలీవుడ్ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ మిస్టర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్.. అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్టుగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అంతే కాకుండా అది మహా భారతం అంటూ న్యూస్ వైరల్ అయ్యింది. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై అమీర్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏం చెప్పాడు..? ఈ వార్తల వెనకున్న అసలు నిజం ఏంటి..?

అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతం. ఎప్పటి నుంచో మహా భారతం తీయాలని.. తీస్తానని అమీర్ ఖాన్ చెబుతూనే ఉన్నారు. ఇటీవల బన్నీ, అమీర్ ఖాన్ ముంబాయిలో కలుసుకున్నారు. ఇక అక్కడ నుంచి మహా భారతంలో అల్లు అర్జున్.. అర్జునుడు పాత్ర పోషించబోతున్నాడని ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశానని అమీర్ చెప్పడంతో ఈ సినిమాలో బన్నీ గురించి క్లారిటీ ఇస్తారని ఎదురు చూసిన జనాలకు అమీర్ ఖాన్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. AlluAjun and Aamir Khan’s movie.

ఇంతకీ అమీర్ ఖాన్ ఏం చెప్పాడంటే.. టాలీవుడ్‌కి చెందిన అల్లు అరవింద్‌ ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. గజిని సినిమా వారితో కలిసి చేయడం వల్ల సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పాడు. అయితే తాను అల్లు అర్జున్ తో కలిసి సినిమా చేస్తున్నానని వార్తలు వస్తున్నాయి. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చేశాడు. అల్లు ఫ్యామిలో బన్నీతో చాలా మంచి పరిచయం ఉంది. గజిని షూటింగ్ జరిగే టైమ్ లో అల్లు అర్జున్ షూటింగ్ కి వచ్చేవాడు.. అప్పటి నుంచి పరిచయం ఏర్పడిందని.. హైదరాబాద్ ఎప్పుడు వెళ్లినా బన్నీని కలిసివాడినని చెప్పారు అమీర్ ఖాన్.

అయితే.. భవిష్యత్ లో అలాంటి ఆలోచన వస్తే.. బన్నీతో చేస్తానేమో కానీ.. ప్రస్తుతానికి అయితే సినిమా చేయడం లేదన్నారు అమీర్ ఖాన్. ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ నటించిన సితారే జమీన్ పర్ మూవీ ఇటీవల రిలీజైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నెక్ట్స్ మహా భారతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన టీమ్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు. ఇందులో ఎవరెవరు నటించనున్నారు…? ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారు..? అనేది త్వరలో ప్రకటిస్తారని సమాచారం. అమీర్ ఖాన్ చెప్పినట్టుగా బన్నీతో ఫ్యూచర్ లో సినిమా చేస్తే కనుక ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

Also Read: https://www.mega9tv.com/cinema/manchu-vishnu-next-movie-and-kannappa-prequel-update-information/