
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోను స్పెషల్ గా డిజైన్ చేసి సినిమా పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇటీవల ఈ సినిమాలో అందాల తార నయనతార నటిస్తుందని తెలియచేస్తూ మరో వీడియో రిలీజ్ చేసాడు అనిల్. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే.. ఎలా ప్రమోట్ చేయాలో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ మూవీలో వెంకీ నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వెంకీ క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. చిరు మూవీలో వెంకీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? ఎంత సేపు ఉండబోతుంది..?
మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి తెరకెక్కించే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించనున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. వెంకీతో అనిల్ రావిపూడి ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చేయడం.. ఈ సినిమాలు ఒకదానిని మించి మరోటి సక్సెస్ సాధించడం తెలిసిందే. దీంతో వెంకీ, అనిల్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అనిల్ అడిగితే వెంకీ కాదనరు.. పైగా ఈ మూవీ ప్రారంభోత్సవానికి కూడా వెంకీ రావడంతో ఈ సినిమాలో నటించడం అనేది కన్ ఫర్మ్ అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వెంకీ క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో వెంకీ క్యారెక్టర్ ఏంటి అనేది బయటకు రాలేదు కానీ.. దాదాపు 25 నిమిషాలు ఉంటుందని మాత్రం వార్తలు వస్తున్నాయి. సెకండాఫ్ లో ఒక ముఖ్యమైన ఎసిసోడ్ దగ్గర ఎంట్రీ ఇస్తాడని.. అక్కడ నుంచి చిరుతో కలిసి వెంకీ చేసే ఎంటర్ టైన్మెంట్ వేరే లెవల్లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. చిరు, వెంకీ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. వీరిద్దరి కామెడీ టైమింగ్ కి అనిల్ రావిపూడి తోడైతే ఎంటర్ టైన్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో మాంచి ఫైట్, అలాగే సాంగ్ కూడా డిజైన్ చేశారని టాక్. ప్రచారంలో ఉన్నది నిజమైతే.. చిరు, వెంకీ కలిసి సంక్రాంతికి వస్తే.. బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించడం ఖాయం. మరి.. ఏం జరగనుందో చూడాలి.