గీతా ఆర్ట్స్ ఇవ్వనున్న బిగ్ సర్ ఫ్రైజ్ ఇదే!

ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పటి వరుకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించింది. ఇటీవల కాలంలో స్పీడు తగ్గించింది. భారీ చిత్రాలు కాకుండా.. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల పైనే దృష్టి పెట్టింది. ఇక నుంచి భారీ చిత్రాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని తెలిసింది. ఇదిలా ఉంటే.. బన్నీ వాసు గీతా ఆర్ట్స్ నుంచి బిగ్ సర్ ఫ్రైజ్ రాబోతోందని చెప్పారు. దీంతో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే ఆ బిగ్ సర్ ఫ్రైజ్ ఏంటి అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. గీతా ఆర్ట్స్ ఇచ్చే బిగ్ సర్ ఫ్రైజ్ ఏంటి..?

గీతా ఆర్ట్స్ నుంచి బిగ్ సర్ ఫ్రైజ్ న్యూస్ అంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందే సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇవ్వడమే. ఈ కాంబో ఎప్పుడో సెట్ అయ్యింది. కాకపోతే బన్నీ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తుండడంతో ఆలస్యం అవుతోంది. పైగా ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అందుచేత త్రివిక్రమ్ తో బన్నీ సినిమాను ఇప్పట్లో అనౌన్స్ చేయరని ఓ టాక్ ఉంది కానీ.. నాలుగు నెలల్లో గీతా ఆర్ట్స్ నుంచి బిగ్ సర్ ఫ్రైజ్ వస్తుందని బన్నీ వాసు చెప్పడం ఆసక్తిగా మారింది.

ఇక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. బన్నీ, త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ మెంటే కదా అంటే.. అది కాకుండా మరోటి ఉందన్నాడు. గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ సినిమా గురించి కాకుండా మరో బిగ్ సర్ ఫ్రైజా ఏంటది అనేది సినీ అభిమానుల్లో మరింతగా క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవితో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు. అసలు చిరు రీ ఎంట్రీ మూవీని గీతా ఆర్ట్స్ లోనే చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. డైరెక్టర్ బోయపాటిని ఫైనల్ చేశారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు.

ఇప్పుడు చిరుతో గీతా ఆర్ట్స్ సినిమాని ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ చిరుతో గీతా ఆర్ట్స్ సినిమా కాకపోతే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో గీతా ఆర్ట్స్ సినిమాను నిర్మించే అవకాశం ఉందని.. ఆ సినిమాను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలా గీతా ఆర్ట్స్ బిగ్ సర్ ఫ్రైజ్ గురించి ప్రచారం జరుగుతుండడంతో నాలుగు నెలల్లో ఎలాంటి ప్రకటన రానుంది అనేది హాట్ టాపిక్ అయ్యింది. తండేల్ సినిమా నుంచి గీతా ఆర్ట్స్ భారీ సినిమాల పై ఫోకస్ పెట్టింది. ఆ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈసారి అంతకు మించి అనేలా.. భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో.. సినిమా ప్లాన్ చేస్తుందట. మరి.. గీతా ఆర్ట్స్ ఇచ్చే బిగ్ సర్ ఫ్రైజ్ ఏంటి అనేది క్లారిటీ రావాలంటే నాలుగు నెలల వరకు వెయిట్ చేయాల్సిందే.