కల్కి 2 వెనుక ఇంత జరుగుతోండా..?

Kalki 2 and Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సంచలన చిత్రం కల్కి. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, యూనిర్శిల్ హీరో కమల్ హాసన్ నటించడంతో అందరిలో కల్కి సినిమా పై ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో కల్కి పార్ట్ 2 పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఇంత వరకు కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ కానుంది.? ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది..? అనేది సమాధానం లేని ప్రశ్నల మారింది. ఇప్పుడు కల్కి 2 గురించి క్లారిటీ వచ్చిందని టాక్ వినిపించింది. ఇంతకీ.. కల్కి 2 వెనుక ఏం జరుగుతోంది..?

ప్రభాస్ సమ్మర్ లో విదేశాలకు వెళ్లిన తర్వాత హైదరాబాద్ వచ్చి ది రాజాసాబ్, ఫౌజీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్ సమ్మర్ లో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యింది. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రాజాసాబ్ మూవీ పై మరింతగా క్రేజ్ పెరిగింది. అలాగే ఈ సినిమాతో పాటు ప్రభాస్ పౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత కల్కి 2 చేస్తాడని ప్రచారం జరిగింది కానీ.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు.

మరి.. కల్కి 2 ఎప్పుడంటే.. ఫౌజీ తర్వాత కల్కి 2 స్టార్ట్ చేస్తాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో కల్కి 2, స్పిరిట్ ఈ రెండింటిలో ఏది ముందుగా స్టార్ట్ కానుందనే సస్పెన్స్ మళ్లీ మొదలైంది. ఆమధ్య స్పిరిటి్ సినిమా చేస్తున్న టైమ్ లో మరో సినిమా చేయకూడదనే కండీషన్ ను సందీప్ రెడ్డి వంగ పెట్టాడని.. అందుచేత స్పిరిట్ మూవీ చేస్తున్న టైమ్ లో కల్కి 2 చేసే ఛాన్స్ లేదని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కల్కి 2 మూవీని సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడనే కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఇదే కనుక నిజమైతే.. స్పిరిట్, కల్కి 2 ఒకేసారి చేసేలా ప్లాన్ చేశాడనిపిస్తోంది. యానిమల్ మూవీ కంప్లీట్ అయినప్పటి నుంచి ఈ కథ పైనే కసరత్తు చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే.. అప్పుడు స్పిరిట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. మరో వైపు నాగ్ అశ్విన్ కూడా కల్కి 2ని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ ను పవర్ ఫుల్ గా చూపింబోతున్నాడని.. కమల్ పాత్ర అందరికీ షాకింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. కల్కి 2, స్పిరిట్ గురించి కన్ ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉండడంతో తెర వెనుక ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. Kalki 2 and Spirit.

Also Read: https://www.mega9tv.com/cinema/buchibabu-and-puri-jagannath-are-born-in-same-hospital-at-pithapuram/