
థియేటర్లకు సంబంధించి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. తాజాగా థియేటర్లను రెంటల్ ప్రాతిపదికన నడపాలా..? పర్సెంటేజ్ లెక్కన నడపాలా..? అనేది చినికి చినికి గాలి వానలా మారింది. రెంటల్ విధానం కాదు.. పర్సెంటేజ్ లెక్కన నడపాలని ఎగ్జిబిటర్స్ వాదాన. ఈ ఉద్యమం ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆతర్వాత అన్ని ఏరియాల ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, సీడెడ్, నైజాం.. ఇలా అన్ని ఏరిమాల ఎగ్జిబిటర్స్ తో ఈ నెల 18న ఫిలిం ఛాంబర్ పెద్ద సమావేశాన్ని నిర్వహించబోతుంది. దీంతో ఈ నెల 18న ఇండస్ట్రీలో ఏం జరగనుంది అనేది ఆసక్తిగా మారింది. ఎగ్జిబిటర్స్ చెబుతున్నట్టుగా పర్సెంటేజ్ విధానం వలన ఎవరకి లాభం..? ఎవరికీ నష్టం..?
ఎగ్జిబిటర్స్ వెనకుండి కొంత మంది సీనియర్ ప్రొడ్యూసర్స్ ఇదంతా నడిపిస్తున్నారని.. యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అనుమానిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు.. సురేష్ బాబు, దిల్ రాజు, శిరీష్ వంటి ఎగ్జిబిటర్స్ వెనకుండి ఇలా మాట్లాడిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అసలు 1980 నుంచి కూడా పర్సేంటేజ్ విధానమే ఉండేది. ఆతర్వాత అప్పటి పెద్దల కారణంగా రెంటల్ సిస్టమ్ గా మార్చారు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలని కోరుకుంటున్నారు. వీళ్లు కోరుకుంటున్నట్టుగా పర్సంటేజ్ విధానం వస్తే ఎవరికీ లాభం అంటే.. ఎగ్జిబిటర్స్ లాభంగాను.. నిర్మాతకు నష్టంగాను ఉంటుంది.
ఈ విధానం అమలులోకి వస్తే.. పుష్ప లాంటి భారీ చిత్రానికి కనీసం 10 నుంచి 20 కోట్లు నిర్మాతకు నష్టం వస్తుంది అంటున్నారు. నష్టం అంటే.. నిర్మాతకు వచ్చే లాభాల్లో అంత మొత్తం తగ్గుతుంది. అందుకనే.. నిర్మాతలు దీనికి వ్యతిరేకం. మరో విషయం ఏంటంటే.. పెద్ద సినిమాకి మొదటి నాలుగు రోజులు రెంటల్ సిస్టమ్ లో అమౌంట్ ఇచ్చి.. ఆతర్వాత నుంచి కలెక్షన్స్ తగ్గిందని పర్సంటేజ్ సిస్టమ్ లో తీసుకోమంటున్నారు. ఇది ఎగ్జిబిటర్స్ నచ్చడం లేదు. సినిమా రిలీజైన ఫస్ట్ మూడు రోజులు కలెక్షన్స్ బాగుంటాయి కాబట్టి రెంటల్ విధానంలో థియేటర్ అద్దె ఇవ్వడం.. కలెక్షన్స్ తగ్గగానే రెంటల్ కట్టలేమని.. పర్సంటేజ్ లో తీసుకోమని చెప్పడాన్ని తప్పుబడుతున్నారు ఎగ్జిబిటర్స్. నిర్మాతలు ఒక్కరే లాభాలు తీసుకోవాలా..? పర్సెంటేజ్ విధానం వలన ఆ లాభాల్లో తమకు కూడా కొంత అమౌంట్ వస్తుంది కదా.. అనేది ఎగ్జిబిటర్స్ వాదన. ఎగ్జిబిటర్స్ అవసరం అయితే.. థియేటర్స్ మూసేస్తాం అంటున్నారు. మరో వైపు నిర్మాతలు సినిమాలు తీయడం మానేస్తాం అంటున్నారు. దీంతో ఈ నెల 18న ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.