బన్నీ కోసం ఇంత పోటీనా… మరి ఓకే చెప్పేది ఎవరికి..?

Icon Star Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ పాన్ వరల్డ్ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో బన్నీ సినిమా చేయాలి. అయితే.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో బన్నీతో సినిమా చేయడం కోసం బడా మేకర్స్ పోటీపడుతున్నారు. దీని గురించి ఈమధ్య బన్నీతో చర్చలు కూడా జరిగాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. బన్నీ కోసం పోటీపడుతుంది ఎవరు..? బన్నీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఎవరికి..?

అట్లీతో సినిమా తర్వాత బన్నీ.. త్రివిక్రమ్ తో సినిమా చేయడం లేదని.. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే తెలిసినప్పటి నుంచి బన్నీతో మూవీ కోసం ప్రయత్నాలు ప్రారంభిచారు. అయితే.. ఇది టాలీవుడ్ బడా మేకర్స్ మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ కూడా బన్నీతో సినిమా కోసం పోటీపడుతున్నారు. త్రివిక్రమ్ తో బన్నీ సినిమా లేదనే వార్త బయటకు వచ్చినప్పుడు మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో బన్నీ సినిమా అంటూ వార్తలు వచ్చాయి. శక్తిమాన్ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆతర్వాత ఆ డైరెక్టర్ ఆ సినిమా చేస్తే రణ్‌ వీర్ సింగ్ తో చేస్తానని.. బన్నీతో ఆ సినిమా అనుకోలేదని చెప్పాడు. అయితే.. సోనీ పిక్చర్స్ బన్నీ, బాసిల్ జోసెఫ్ కాంబోలో మూవీ చేయాలి అనుకుందని తెలిసింది.

బన్నీతో సినిమా అంటూ కొత్తగా మరో వార్త బయటకు వచ్చింది. మేటర్ ఏంటంటే.. బన్నీతో దిల్ రాజు సినిమా చేయాలి అనుకుంటున్నారు. దీనికి రావణం అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందని.. ఈ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాథమ్ సినిమాలు నిర్మించారు. ఈ సంస్ధతో అల్లు అర్జున్ కు మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే బన్నీతో ఖచ్చితంగా సినిమా చేస్తానని.. వేరే లెవల్లో ఉంటుంది అన్నట్టుగా దిల్ రాజు చెబుతున్నారు. Icon Star Allu Arjun.

అయితే.. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం.. ఈ సినిమాతో చరిత్ర సృష్టించడంతో.. బన్నీతో సినిమా చేయడం కోసం కోలీవుడ్, బాలీవుడ్ బడా మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ బన్నీతో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఆమధ్య బన్నీ, భన్సాలీ మధ్య మీటింగ్ కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. అలాగే అమీర్ ఖాన్ తో అల్లు అర్జున్ కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబోలో కూడా సినిమా గురించి ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా బన్నీతో సినిమా నిర్మించడానికి ట్రై చేస్తుందట. వీళ్లే కాకుండా మరి కొంత మంది బడా మేకర్స్ బన్నీకి భారీగా ఆఫర్ చేస్తున్నారని టాక్. మరి.. బన్నీ నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడో… ఎవరికీ ఛాన్స్ ఇస్తాడో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: https://www.mega9tv.com/cinema/sai-dharam-tejs-sambarala-yeti-gattu-postponed-due-to-akhanda-2-and-og-movie/