
నట సింహం నందమూరి బాలకృష్ణ స్పీడు మామూలుగా లేదు. వరుసగా సక్సెస్ సాధిస్తూ దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటితో అఖండ 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత చేసేందుకు బాలయ్య రెండు కథలను ఫైనల్ చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. బాలయ్య ఓకే చేసిన రెండు కథలు ఏంటి..? బాలయ్యను మెప్పించిన కోలీవుడ్ డైరెక్టర్ ఎవరు..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ చూడాల్సిందే.
బాలయ్య అఖండ 2 షూటింగ్ పక్కా ప్లానింగ్ తో జరుగుతోంది. సెప్టెంబర్ 25న ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక బాలయ్య ఒకే చేసిన రెండు కథల్లో ఒకటి మలినేని గోపీచంద్ చెప్పిన కథ. ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేయనున్నారు. జులై లేదా ఆగష్టు నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇక బాలయ్య ఓకే చేసిన రెండో కథ ఏంటంటే.. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999. ఈ చిత్రాన్ని బాలయ్యే డైరెక్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆ ఛాన్స్ క్రిష్ కి అప్పగించారు. డిసెంబర్ నుంచి ఈసినిమా పట్టాలెక్కించనున్నారు.
ఇటీవల బాలయ్యకు కథ చెప్పిన కోలీవుడ్ డైరెక్టర్ ఎవరంటే.. అధిక్ రవిచంద్రన్ అని సమాచారం. కోలీవుడ్ స్టార్ అజిత్ తో అధిక్ రవిచంద్రన్ గుబ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. నెక్ట్స్ మళ్లీ అజిత్ తో సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈమధ్య బాలయ్యకు అధిక్ రవిచంద్రన్ కథ చెబితే బాగుందని.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫుల్ నెరేషన్లో మెప్పిస్తే.. ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయినా సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.