కుబేర మూవీని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు..?

Heroes Who Rejected Kuberaa: కుబేర.. ఇండస్ట్రీకి ఊపిరి పోసిన సినిమా ఇది. థియేటర్స్ లో సినిమా చేసేందుకు జనాలు రాక.. సరైన సినిమా లేక.. ధియేటర్స్ ఓనర్స్ తెగ బాధపడుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఇండస్ట్రీకి ఉత్సాహాన్ని అందించిన సినిమా కుబేర. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించారు. సినీ ప్రేమికులు, సినీ విమర్శకులు, సినీ ప్రముఖులు.. కుబేర సినిమాని మనస్పూర్తిగా అభినందిస్తున్నారు. నాగార్జున, ధనుష్.. ఇద్దరూ అద్భుతంగా నటించారు అంటూ అభినందిస్తున్నారు. అయితే.. ఈ పాత్రల కోసం ముందుగా నాగ్, ధనుష్ ని కాకుండా వేరే ఇద్దరు హీరోలను అనుకోవడం.. కాంటాక్ట్ చేయడం.. జరిగిందట. ఇంతకీ.. అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్న స్టార్స్ ఎవరు..? అసలు ఏమైంది..?

దేవ పాత్ర కోసం శేఖర్ కమ్ముల ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నారట. ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండను పరిచయం చేసింది శేఖర్ కమ్ములనే. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే సినిమాలో విజయ్ ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆతర్వాత విజయ్ తో శేఖర్ కమ్ముల ఇంత వరకు మరో సినిమా చేయలేదు. అయితే.. కుబేర సినిమాలో బెగ్గర్ గా దేవ పాత్ర గురించి చెబితే.. ఆ పాత్ర తనకు సెట్ కాదని రిజెక్ట్ చేశాడట. విజయ్ దేవరకొండ నో చెప్పడంతో కోలీవుడ్ స్టార్ ధనుష్ ని కాంటాక్ట్ చేశారట. కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేయడానికి ధనుష్ ఓకే చెప్పాడట.

ఇక దీపక్ పాత్ర కోసం ముందుగా నాగార్జునను అనుకోలేదట.. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ ను అనకున్నారట. మోహన్ లాల్ ను కలిసి కథ చెబితే ఇంట్రెస్ట్ చూపించలేదట. అయితే.. ఆతర్వాత కొన్ని రోజులు తర్వాత శేఖర్ కమ్ములను మరోసారి కథ చెప్పమని మోహన్ లాల్ అడిగారట. అయితే.. అప్పటికే శేఖర్ కమ్ముల దీపక్ పాత్రను నాగార్జునతో చేయిస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట. ఆ ఆలోచన రాగానే నాగార్జునను కాంటాక్ట్ చేసి దీపక్ క్యారెక్టర్ గురించి చెప్పారట. కథ విన్న తర్వాత కొన్ని రోజులు ఆలోచించి.. ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారట నాగ్. Heroes Who Rejected Kuberaa.

ఈవిధంగా కుబేర సినిమాని విజయ్ దేవరకొండ, మోహన్ లాల్ రిజెక్ట్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇప్పుడు ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వడంతో పాటు ఇందులో నటించిన ధనుష్‌, నాగార్జున ఇద్దరికీ మంచి పేరు తీసుకవచ్చింది. ధనుష్ కు అయితే.. ఏకంగా నేషనల్ అవార్డ్ రావడం పక్కా అని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై చెప్పడం.. ముందుగానే అభినందనలు చెప్పడం విశేషం. దీనిని బట్టి ధనుష్ పాత్ర ఎంత బాగా వచ్చిందో.. ఎంతలా కనెక్ట్ అయ్యిందో.. ఎంతలా అద్భుతంగా నటించాడో తెలుస్తోంది. ఇక దీపక్ పాత్ర అయితే.. నాగార్జునకు కొత్తగా డోర్స్ ఓపెన్ చేసినట్టు అయ్యిందని.. ఇక నుంచి మరెన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలు వస్తాయని చిరు చెప్పడం మరో విశేషం.

Also Read: https://www.mega9tv.com/cinema/rock-star-devi-sri-prasad-facing-another-controversy-in-kuberaa-success-meet/