
Sekhar Kammula’s next movie: ఇండస్ట్రీలో ఒకరితో సినిమా చేయాలనుకుంటే.. మరొకరితో ప్రాజెక్ట్ సెట్ అవ్వడం అనేది కామనే. నాటి నుంచి నేటి వరకు ఇలాంటివి చాలా జరిగాయి. అయితే.. నేచురల్ స్టార్ నానితో సినిమా చేయాలనుకుంటే.. అంతకంటే ముందు మరో స్టార్ తో సెట్ అయ్యిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ.. మరో స్టార్ ఎవరు..? అసలు నానితో సినిమా చేయడం కోసం ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ ఎవరు..? ఈ ప్రాజెక్ట్ కు కొబ్బరికాయ కొట్టేది ఎప్పుడు..?
నేచురల్ స్టార్ నానితో సినిమా చేయాలి అనుకుంటున్న స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు శేఖర్ కమ్ముల. ఆనంద్ సినిమా దగ్గర నుంచి కుబేర వరకు తన ప్రతి సినిమాలో ఏదో చెప్పాలని తపిస్తుంటారు. సున్నితమైన అంశాలను అద్భుతంగా తెరకెక్కించి ఆడియన్స్ ని ఆకట్టుకుంటారు. కుబేర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న శేఖర్ కమ్ముల తదుపరి చిత్రాన్ని నానితో చేయాలి అనుకున్నారు. అసలు నాని, శేఖర్ కమ్ముల ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు కానీ.. కుదరడం లేదు. ఈసారి మాత్రం నెక్ట్స్ సినిమా నానితో చేస్తాను.. కథ ఐడియా ఉంది.. ఫుల్ స్క్రిప్ట్ గా మార్చాలని ఇటీవల శేఖర్ కమ్ముల మీడియాకి తెలియచేశారు.
అయితే.. నాని ఇప్పుడు ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. ఇంత వరకు నానిని ఎవరూ చూపించని షాకింగ్ క్యారెక్టర్ లో చూపిస్తున్నాడు. గ్లింప్స్ తోనే అందర్నీ షాక్ కి గురి చేశాడు. అయితే.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మార్చి 26న రిలీజ్ అని ప్రకటించాడు. అయితే.. మార్చి 27న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ అవుతుండడంతో ప్యారడైజ్ మే నెలలో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత నాని.. సుజిత్ తో సినిమా చేస్తాడని తెలిసింది. ఈ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించనున్నారు. Sekhar Kammula’s next movie.
నానితో ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే టైమ్ పడుతుంది. అందుకనే ఈ గ్యాప్ లో శేఖర్ కమ్ముల మరో మూవీ ప్లాన్ చేస్తున్నారని.. ఆ సినిమాని స్టార్ హీరోయిన్ సమంతతో ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత సినిమాలకు ఈమధ్య బాగా గ్యాప్ వచ్చింది. ఇటీవల శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా నిర్మాతగా సమంతకు విజయాన్ని అందించింది. సమంత కూడా శేఖర్ కమ్ములతో సినిమాను ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటుందట. ఇప్పుడు సమంత, శేఖర్ కమ్ముల కాంబోలో మూవీ అనగానే ఇది నిజమే అనిపిస్తోంది. ఈ సెన్సిబుల్ డైరెక్టర్ కథ రాయడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటారు. అందుచేత శేఖర్ కమ్ముల కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాలంటే.. నెక్ట్స్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అయితే.. సమంత, శేఖర్ కమ్ముల సినిమా నిజంగానే ఉంటుందా..? లేక వార్తలకే పరిమితం అవుతుందా..? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.