
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ సినిమాకి మారుతి డైరెక్టర్. హర్రర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న రాజాసాబ్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. అయితే.. ఈ టీజర్ ఈవెంట్ లో నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఓ నిర్మాత నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడని చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో రాజాసాబ్ కి నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఫ్యాన్స్ లోనూ, ఇండస్ట్రీలోనూ దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. ఓ నిర్మాత పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఆ నిర్మాత ఎవరు..? అసలు ఏం జరిగింది..?
ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో సినిమా అనగానే.. ఇది నిజమా అని షాక్ అయ్యారు అభిమానులు, సినీ జనాలు. ఇదేదో గాసిప్ అనుకుంటే.. నిజంగా నిజమని నిరూపించారు. అయితే.. ఈ సినిమా కన్ ఫర్మ్ అని తెలిసినప్పుడు ప్రభాస్ అభిమానులే ఈ సినిమా వద్దు అంటూ సోషల్ మీడియాలో పెద్ద హడావిడి చేశారు. ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచేలా పోస్టులు కూడా పెట్టారు. ఆతర్వాత ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి అభిమానులు ఈ సినిమాకి సపోర్ట్ చేస్తుండడం.. నెగిటీవ్ పోస్టులు పెట్టడం మానేయడం జరిగింది.

ఇదిలా ఉంటే.. ఎస్.కె.ఎన్ ఓ నిర్మాత నెగిటివ్ ట్రెండ్ క్రియేట్ చేశారన్నారు కదా.. అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఏం జరిగిందంటే.. ఈ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య నిర్మించాలి అనుకున్నారు. అయితే.. మారుతి దర్శకత్వంలో ఈమధ్య కాలంలో వచ్చిన ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్ సినిమాలు ఫరవాలేదు అనిపించాయి కానీ.. బ్లాక్ బస్టర్ అనేలా సక్సెస్ సాధించలేదు. అందుచేత ప్రభాస్, మారుతి కాంబోలో సినిమా వస్తే.. వర్కవుట్ అవ్వదు అనుకున్నారో ఏమో కానీ.. డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దగ్గరకి వెళ్లింది.

అయితే.. నిర్మాత దానయ్య రాజాసాబ్ సినిమా గురించి నెగిటివ్ క్యాంపెయిన్ చేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు. మరి.. ఆయన ఎవరి దగ్గరైనా రాజాసాబ్ గురించి నెగిటివ్ గా మాట్లాడారా..? లేక ఇంకెవరైనా ప్రొడ్యూసర్ నెగిటీవ్ క్యాంపెయిన్ చేశారా..? అనేది ఆసక్తిగా మారింది. ఎవరైతే.. ఈ సినిమాని, మారుతిని తక్కువ అంచనా వేశారో వాళ్లకి ఈ సినిమా సమాధానం చెబుతుందని.. వాళ్లే సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ అయ్యేలా చేస్తారని ఎస్,కే.ఎన్ చెప్పడం సంచలనంగా మారింది. ఈ పాన్ ఇండియా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందన్నాడు. మరి.. తను చేసిన కామెంట్స్ పై ఎస్.కే.ఎన్ క్లారిటీ ఇచ్చి.. ఆ నిర్మాత ఎవరో చెబుతాడేమో చూడాలి.