
Dilraju About Game Changer: గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన సినిమా. సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే.. ఈ సినిమా రిలీజై ఆరు నెలలు అయ్యింది. అయినప్పటికీ.. గేమ్ ఛేంజర్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా గేమ్ ఛేంజర్ వివాదస్పం అవ్వడం అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకు గేమ్ ఛేంజర్ గురించి దిల్ రాజు పదే పదే మాట్లాడుతున్నారు..? శిరీష్ ఎందుకు అలా కామెంట్ చేశాడు..? చరణ్ ఫ్యాన్స్ అంతలా వార్నింగ్ ఎందుకు ఇచ్చారు..? శిరీష్ ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది..? అసలు ఏం జరిగింది..? ఇందులో తప్పు ఎవరిది..?
గేమ్ ఛేంజర్ సినిమాని నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు తమ్ముడు అనే సినిమాను నిర్మించాడు. అయితే.. తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు మనసులో మాటలను బయటపెట్టారు. గేమ్ ఛేంజర్ తను చేసిన మిస్టేక్ అని.. చరణ్ కు హిట్ సినిమా ఇవ్వలేకపోయామనే గిల్ట్ ఉందని ఇలా చాలా మాట్లాడారు. దిల్ రాజు ఇచ్చిన అన్ని ఇంటర్ వ్యూలో గేమ్ ఛేంజర్ ప్రస్తావన వస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్ శిరీష్ ఇంటర్ వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్ వ్యూలో గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ అయిన తర్వాత హీరో రామ్ చరణ్ కానీ.. డైరెక్టర్ శంకర్ కానీ.. ఏమైంది..? ఎలా ఉన్నారు..? అని కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పారు. శిరీష్ చేసిన ఈ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ లేఖలో ఏమని రాసారంటే.. ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక అంటూ ఆరు పాయింట్లు రాసారు. సినిమా అనేది ఒక బిజినెస్. దానిలో లాభాలు వస్తాయి.. నష్టాలు వస్తాయని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్ లో అన్ని సినిమాలకు మీవల్లే విజయాలు.. మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. Dilraju About Game Changer.
ఇక ఫ్యాన్స్ రాసిన ఆరు పాయింట్స్ ఏమిటంటే.. 1) 1 నేనొక్కడినే టైమ్ లో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా..? 2) మైత్రీ బ్యానర్లో ఫ్లాపులు వచ్చినప్పుడు ఏ హీరో గురించైనా మాట్లాడారా..? 3) సైంధవ్ ప్లాప్ అయినప్పుడు ఆ నిర్మాత ఎందుకు ఒక్కసారి కూడా ఆ హీరో గురించి మాట్లాడలేదు..? 4) సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ అయినప్పుడు వెంకటేష్ గార్కి ఎంత ఇచ్చారు..? ముందు మాట్లాడుకున్నదే ఇచ్చారా..? ఎక్స్ ట్రా ఏమైనా ఇచ్చారా..? 5) దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్లింది ఎవరు..? ఒక సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరు..? 6) ఆర్ఆర్ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరో పై విషం చిమ్మడం కరెక్టేనా..? అని ప్రశ్నించారు.
మా అభిమానులు మూడు ఏళ్లుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ప్లాప్ అయ్యిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్ లో, ప్రతి ఇంటర్ వ్యూలో పదే పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక.. ఇంకోసారి గేమ్ ఛేంజర్ సినిమా గురించి కానీ.. రామ్ చరణ్ గారి గురించి కానీ.. తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఖబడ్దార్.. అంటూ రామ్ చరణ్ అభిమానులు లేఖ రిలీజ్ చేశారు.
ఈ వివాదం ముదురుతుండడంతో శిరీష్ ఓ లెటర్ రిలీజ్ చేశారు. అందులో తాను మాట్లాడిన మాటలు అపార్థాలకు దారి తీస్తున్నాయని.. మెగా ఫ్యాన్స్ ఈ మాటలతో బాధపడుతున్నారని తనకు తెలిసిందని.. గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తమకు పూర్తి సమయం, సహకారం అందించారన్నారు శిరీష్.. మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడానని.. తన కామెంట్స్ ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు శిరీష్ తాజాగా ఈ ఓపెన్ లెటర్‌లో పేర్కొన్నారు. అయితే.. ఈ వివాదంలో తప్పు ఎవరిది అనేది కనుక చూస్తే.. గేమ్ ఛేంజర్ గురించి మీడియా అడిగినా దిల్ రాజు నో కామెంట్ అనే చెబితే అక్కడితో అయిపోయేది. దిల్ రాజు మాట్లాడినా.. అతని మాటల్లో బాధ కనిపించేది తప్పా.. చరణ్ ని ఏమీ అనలేదు. శిరీష్ మాత్రం చరణ్ కనీసం పోన్ చేయలేదు అని చెప్పడమే అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. వారి ఆవేదనలో అర్ధం ఉంది. చరణ్ ఫోన్ చేయలేదు అంటే.. ఆయన ఎంత బాధపడి ఉంటారు..? ఆర్ఆర్ఆర్ తర్వాత తన రేంజ్ మరింత పెంచే సినిమా తీస్తారని.. దిల్ రాజు దగ్గరుండి చూసుకుంటారని నమ్మకంతో ఇస్తే.. నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. నిజంగా తప్పు ఎవరిది అనేది చెప్పాలంటే.. శిరీష్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆయన క్షమాపణలు చెప్పారు కాబట్టి.. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందేమో చూడాలి.