తమ్ముడు టైటిల్ కి నితిన్ నో చెప్పాడా..?

Nithin Thammudu Title Reason: హీరో నితిన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఆ ఇష్టంతోనే.. తన సినిమాల్లో ఏదో సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం కానీ.. పవన్ కళ్యాణ్‌ గురించి ఏదైనా సీన్ చూపించడం కానీ చేస్తుంటాడు. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ కెరీర్ లో మరిచిపోలేని చిత్రాల్లో ఒకటైన తమ్ముడు టైటిల్ తోనే వస్తున్నాడు. అయితే.. ఈసారి తమ్ముడు టైటిల్ పెడతామంటే.. నితిన్ వద్దన్నాడట. అదేంటి.. పవర్ స్టార్ టైటిల్ పెడతామంటే వద్దనడానికి కారణం ఏంటి..? అసలు ఏం జరిగింది..?

నితిన్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచి తన సినిమాల్లో పవన్ కళ్యాణ్‌ పై ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. అలాగే నితిన్ చూపించే ప్రేమకు గాను పవన్ కళ్యాణ్‌ ఛల్ మోహన్ రంగా అనే సినిమాను నిర్మించడం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్‌ ను నితిన్ బాగా వాడుకుంటున్నాడు అనే కామెంట్స్ గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ గురించి తెలుసుకున్న నితిన్ ఈ సినిమాకి తమ్ముడు అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నామని డైరెక్టర్ వేణు శ్రీరామ్ చెప్పినప్పుడు వద్దన్నాడట. అయితే.. ఈ కథకు ఈ టైటిలే యాప్ట్ గా ఉంటుందని నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్ చెప్పడంతో కాదనలేక ఓకే చెప్పాడట నితిన్.

ఇప్పుడు నితిన్ కెరీర్ లో వరుసగా ఫ్లాపులు వచ్చాయి. సక్సెస్ చూసి చాన్నాళ్లు అయ్యింది. అందుచేత ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఇలాంటి టైమ్ లో పవన్ కళ్యాణ్‌ మూవీ టైటిల్ తో తమ్ముడు అంటూ వస్తుండడం.. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కొత్తగా ఉండి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో పాజిటివ్ బజ్ ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. నిర్మాత దిల్ రాజు వరుసగా ఇంటర్ వ్యూలు ఇస్తూ తమ్ముడు సినిమాని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళుతున్నారు. నితిన్ వరుసగా ప్లాపుల్లో ఉన్నా.. పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టడం ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. Nithin Thammudu Title Reason.

ఇందులో నితిన్ కు జంటగా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ నటించారు. ఇక సీనియర్ హీరోయిన్ లయ ఈ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇందులో నితిన్ కు అక్కగా నటించింది. అక్క, తమ్ముడు కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి 70 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం అనేది హాట్ టాపిక్ అయ్యింది. నితిన్ కెరీర్ ఏమాత్రం బాగోలేదు. రీసెంట్ గా రిలీజైన రాబిన్ హుడ్ మూవీ డిజాస్టర్ అయ్యింది. సక్సెస్ లో లేని హీరోతో 70 కోట్లు పెట్టి సినిమా తీయడం అంటే రిస్క్. అయినప్పటికీ కథ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరి.. దిల్ రాజు నమ్మకం నిజమౌతుందా..? తమ్ముడు విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/whats-going-on-behind-the-prabhas-movies-confusion-continues-about-kalki-2-and-spirit/