కన్నప్పకు ప్రభాస్ దూరం.. అసలు కారణం ఇదే.!

Prabhas Kannappa Promotions: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమాకి ముఖేష్‌ కుమార్ సింగ్ డైరెక్టర్. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్యపాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా బజ్ లేదు. అయితే.. మంచు విష్ణు అంతా తానై ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో కన్నప్ప సినిమా పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఈ భారీ చిత్రం ప్రమోషన్స్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ జరుగుతున్నాయి కానీ.. ఎక్కడ ప్రభాస్ మాత్రం కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తాడని ప్రచారం జరిగింది కానీ.. ప్రభాస్ రాలేదు. మూవీ కూడా రిలీజై డిఫరెంట్ టాక్ తో నడుస్తోంది. అసలు ఎందుకు ప్రభాస్ కన్నప్పకు దూరంగా ఉన్నాడు..? దీని వెనకున్న అసలు కారణం ఏంటి..?

కన్నప్ప సినిమా కోసం విష్ణు తన వంతుగా ఏం చేయాలో అంతా చేశాడు. రెండు పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాడు. ఎన్నో ఇంటర్ వ్యూలు.. ఎన్నో విశేషాలు.. ఇంకెన్నో ప్రెస్ మీట్స్ పెట్టి ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతుగా ప్రయత్నం చేశాడు. అంతే కాకుండా.. పుణ్యక్షేత్రాలు తిరిగాడు.. పలువురు ఆలయ ప్రముఖులు, పూజారులకు కన్నప్ప సినిమా చూపించి డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకున్నాడు. అలాగే సెన్సార్ చెప్పిన అభ్యంతరాలను కూడా తొలగించి ఫైనల్ గా కన్నప్ప రన్ టైమ్ 3 గంటల 2 నిమిషాలకు లాక్ చేశాడు. ఇప్పటి వరకు అంతా అనుకున్నట్టుగానే జరిగింది.

అయితే.. ఒకటే జనాలకు అర్థం కావడం లేదు. అదేంటి అంటే.. ప్రభాస్ కన్నప్ప సినిమాకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తాడు అనుకున్నారు. మరి.. ఎందుకు రాలేదు..? వచ్చుంటే ఈ సినిమాకి మరింత బజ్ క్రియేట్ అయ్యేది. ఒపెనింగ్ మరింత బాగా ఉండేది కదా.. ఇవే ప్రశ్నలు అభిమానులు, సినీ జనాల్లో ఉన్నాయి. ఇంతకీ కారణం ఏంటంటే… ప్రభాస్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఓప్పుకున్న టైమ్ లోనే ప్రమోషన్లకు తాను రాలేనని తర్వాత మొహమాట పెట్టి ఇబ్బంది పెట్టద్దని విష్ణు, మోహన్ బాబుకు చెప్పాడట. Prabhas Kannappa Promotions.

ప్రభాస్ ఇలా చెప్పగానే.. ఈ సినిమాలో నటించడమే గొప్ప విషయం.. ప్రమోషన్స్ కు రాకపోయినా ఫరవాలేదు అని వెంటనే ఓకే చెప్పారట. సమ్మర్ లో విదేశాలకు వెళ్లిన ప్రభాస్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత రాజాసాబ్, ఫౌజీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. నిజంగా ప్రభాస్ కానీ.. ఈ సినిమాకి ప్రమోషన్స్ చేసుంటే.. ఓపెనింగ్ వేరే లెవల్లో ఉండేది. ఈ భక్తి చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ తదితరులు నటించారు. మరి.. కన్నప్ప మంచు విష్ణుకు ఎలాంటి ఫైనల్ రిజల్ట్ అందిస్తుందోచూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/mahesh-babu-appreciate-sumanth-for-his-emotional-acting-on-anaganaga-web-series/