
Why Sreeleela Left Akhil’s Lenin: అక్కినేని అఖిల్ నటిస్తోన్న మూవీ లెనిన్. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్. ఈమధ్య ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమా పై అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు లెనిన్ మూవీ రిలీజ్ అవుతుందా అని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి అప్ డేట్ వస్తుందని ఈగర్ గా వెయిట్ చేస్తుంటే.. ఇప్పుడు ఈ మూవీ నుంచి శ్రీలీల తప్పుకుందనే షాక్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఏమైంది..? శ్రీలీల తప్పుకుంటే ఇందులో నటించే కథానాయిక ఎవరు..?
శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. రవితేజతో ధమాకా, మహేష్ బాబుతో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్.. ఇలా స్టార్ హీరోలతో నటించే స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే.. ఇప్పుడు ఆమె ఫోకస్ అంతా కోలీవుడ్, బాలీవుడ్ పై పెట్టిందట. అందుకనే.. బాలీవుడ్ సినిమాల కోసం టాలీవుడ్ సినిమాల పై అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీలీల కెరీర్ ను డైరెక్ట్ చేస్తుంది వాళ్ల అమ్మే అని.. ఆమె వలనే శ్రీలీల తెలుగు సినిమాలకు దూరం అవుతుందని ప్రచారం జరుగుతోంది.
ఏజెంట్ సినిమా తర్వాత చాలా కథలు విని లెనిన్ అనే కథను ఓకే చేశాడు అఖిల్. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని ఎంత తొందరగా వీలైతే.. అంత తొందరగా రిలీజ్ చేయాలి అనుకుంటే.. ఇప్పుడు శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుందట. దీంతో ఈ సినిమా మేకర్స్ మరో హీరోయిన్ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేసారని తెలిసింది. శ్రీలీల రవితేజతో మాస్ జాతర అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకి డేట్స్ ఇవ్వాలి.. లెనిన్ కి డేట్స్ ఇవ్వాల్సి రావడం.. పైగా బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు ఒప్పుకోవడం వలన డేట్స్ అడ్జెస్ట్ చేయడం కుదరడం లేదట. This is Why Sreeleela Left Akhil’s Lenin.
శ్రీలీల పై కొన్ని సీన్స్ చిత్రీకరించారట. ఇప్పుడు కొత్త హీరోయిన్ ని తీసుకుంటే మళ్లీ కొన్ని సీన్స్ రీషూట్ చేయాలి. దీంతో లెనిన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. శ్రీలీల ఇండస్ట్రీలో ప్లానింగ్ లేకుండా సినిమాలు ఒప్పుకుని.. ఆతర్వాత డేట్స్ ఇవ్వకుండా… నిర్మాతలను ఇబ్బంది పెడుతుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లెనిన్ మూవీ నుంచి తప్పుకోవడం చూస్తుంటే.. ఇదంతా నిజమే అనిపిస్తోంది. మరి.. శ్రీలీల తప్పుకుంటే.. ఎవర్ని తీసుకుంటారో.. ఎప్పటికి లెనిన్ పూర్తవుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.