బన్నీ మూవీలో విలన్ హాలీవుడ్ స్టార్…?

Will Smith Joins “AA26 x A6”: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. వీరిద్దరి కాంబోలో క్రేజీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ సినిమా గురించి ఏ న్యూస్ బయటకు వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బన్నీ.. హీరోగానే కాదు.. విలన్ గా కూడా నటిస్తున్నాడని ఆమధ్య ప్రచారం జరిగింది. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. ఇప్పుడు ఈ క్రేజీ మూవీలో విలన్ గా హాలీవుడ్ స్టార్ నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ హాలీవుడ్ స్టార్ ఎవరు..? అసలు అట్లీ ప్లాన్ ఏంటి..?

అట్లీ ఈ సినిమాని చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకుని రూపొందిస్తున్నారు. దీని కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపుతున్నారు. తెర పై విజువల్ వండర్ అనేలా ఈ మూవీని అందించి ఆడియన్స్ కి థ్రిల్ కలిగించాలని భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నాడు. ఒక్కసారి షూట్ స్టార్ట్ చేస్తే.. గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా డిజైన్ చేసుకుంటున్నాడు. మరీ.. ముఖ్యంగా తను అనుకున్నది ఎలా వస్తుందో చూసుకోవడం కోసం ముందుగా టెస్టింగ్ షూట్ చేసి ఆతర్వాత అంతా అనుకున్నట్టుగా వస్తుంది అనుకుంటే.. ఇప్పుడు రియల్ షూట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడట. Will Smith Joins “AA26 x A6”.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం హాలీవుడ్ స్టార్ విల్ స్మితను కాంటాక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఐ యామ్ లెజెండ్, మెన్ ఇన్ బ్లాక్, కింగ్ రిచర్డ్.. తదితర వరల్డ్ ఫేమస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విల్ స్మిత్.. బన్నీ మూవీలో విలన్ గా నటించనున్నాడని వార్తలు రావడంతో విలన్ క్యారెక్టర్ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. గతంలో ఈ సినిమాలో హీరో, విలన్ రెండు పాత్రలను బన్నీనే చేస్తున్నాడని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు తెర పైకి రావడంతో ఇది నిజమా..? కాదా..? అనేది సస్పెన్స్ గా మారింది.

ఈ భారీ, క్రేజీ మూవీని దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో కథనాయికలుగా దీపిక పడుకునే ఫిక్స్ అయ్యింది. ఆమెతో పాటు మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలిసింది. ఈ ముద్దుగుమ్మలు గ్లామర్ చూపించడమే కాదు.. పర్ ఫార్మెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. ఆవిధంగా హీరోయిన్స్ పాత్రలను డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందుతోన్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Also Read: https://www.mega9tv.com/cinema/tamannaah-is-going-to-do-a-special-song-in-the-movie-the-rajasaab-starring-prabhas-as-the-hero/