
నట సింహం బాలయ్య, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో అఖండ సినిమా సీక్వెల్ అఖండ 2 రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయ్యింది. అదేంటి అంటారా..? ఈ క్రేజీ మూవీలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తుందని.. బాలయ్య, విజయశాంతి కాంబోలో వచ్చే సీన్స్ ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి.. నిజంగానే అఖండ 2 లో విజయశాంతి నటిస్తుందా..? అసలు వాస్తవం ఏంటి..? ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు..?
బాలయ్య, విజయశాంతి కాంబో ఓ సెన్సేషన్. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ దాదాపుగా సక్సెస్ సాధించినవే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత ఇక సినిమాల్లో నటించను అని చెప్పినప్పటికీ.. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో నటించారు. ఓ వైపు పొలిటికల్ గా బిజీగా ఉన్నప్పటికీ.. మంచి పాత్రలు వస్తే.. సినిమాల్లో నటించేందుకు ఓకే చెబుతున్నారు.
బాలయ్య అఖండ 2 లో విజయశాంతి నటిస్తున్నట్టుగా ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదే విషయం గురించి విజయశాంతిని అడిగితే.. అఖండ 2 లో నటిస్తున్నానే విషయం మీడియా చెబితేనే తెలుస్తుంది తప్పా నన్ను ఎవరూ కాంటాక్ట్ చేయలేదని చెప్పారు. ఇదంతా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ప్రమోషన్స్ టైమ్ లో మీడియాకు ముందుకు వచ్చినప్పుడు జరిగింది. ఇప్పుడు మళ్లీ అఖండ 2 లో విజయశాంతి అంటూ న్యూస్ వైరల్ అవ్వడం ఆసక్తిగా మారింది. బోయపాటి విజయశాంతి కోసం పవర్ ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అఖండ 2 లో విజయశాంతి నటించడం నిజమా..? కాదా..? అనేది సస్పెన్స్ గా మారింది. మరి.. బోయపాటి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.