విష్ణు రియాక్ట్ అవుతాడా..?

మంచు విష్ణు కన్నస్ప సినిమాలోని శివయ్యా.. అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. ఇటీవల సింగిల్ మూవీలో శ్రీవిష్ణు ఈ డైలాగ్ పెడితే.. మంచు విష్ణుకు కోపం వచ్చింది. దీంతో వివాదస్పదం అవ్వడం తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న మంచు విష్ణు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకురావడం.. ఆతర్వాత శ్రీవిష్ణు సారీ చెప్పడం.. ఆ డైలాగ్స్ ను సినిమా నుంచి తీసేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మంచు మనోజ్ శివయ్యా.. అంటూ కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. మరి.. మనోజ్ కామెంట్స్ పై విష్ణు రియాక్ట్ అవుతాడా..? అసలు మనోజ్ ఏమన్నాడు..?

మంచు మనోజ్ నటించిన సినిమా భైరవం. ఈ సినిమాకి విజయ్ కనకమేడల డైరెక్టర్. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ.. శివ‌య్యా అంటే శివుడు రాడు అంటూ ప్ర‌త్య‌క్షంగానే విష్ణు పై సెరైట్ వేశాడు. భైరవంలో కూడా విష్ణుని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయని తెలుస్తోంది. అంతే కాదు… ఇటీవ‌ల ఓ టీవీ షోకి ప్ర‌మోష‌న్ కోసం హాజ‌రయ్యాడు మ‌నోజ్‌. అక్క‌డ కూడా పోగ్రాం మ‌ధ్య‌లో శివయ్యా… అంటూ గ‌ట్టిగా అరిచాడ‌ట మ‌నోజ్‌. ఆ ఎపిసోడ్ లో మంచు మనోజ్ డైలాగ్ ఉంచాలో తీసేయాలా అని ఆలోచిస్తున్నారట.

ఎందుకంటే.. అక్కడ ఉంది విష్ణు వెనకాల మోహన్ బాబు. ఆయనతో పెట్టుకుంటే.. ఏదైనా జరగచ్చు. అందుకనే మనోజ్ శివయ్యా అంటూ చెప్పిన డైలాగ్ ఉంచాలా.? వద్దా అని ఆలోచిస్తుందట ఆ టీవీ యాజమాన్యం. ఇదిలా ఉంటే.. మనోజ్ తను మోహన్ బాబు అబ్బాయినేని చెబుతూ ఎమోషనల్ అవ్వడం చాలా మందిని కదిలించింది. చాలా గ్యాప్ తర్వాత సినిమాలు చేయాలని ప్రయత్నించాడు కానీ.. వర్కవుట్ కాలేదు. ఇప్పుడు భైరవం అంటూ వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు. మరి.. మనోజ్ కెరీర్ ఇక నుంచైనా స్పీడు అందుకుంటుందేమో చూడాలి.