
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కు ఇది సీక్వెల్‌గా రాబోతుంది. ఈ సినిమాలో హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా విడుదలకు ఇంకా 50 రోజులు ఉందని తెలుపుతూ.. కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ పోస్టర్‌ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు తారక్.

ఈ సినిమాను నిర్మిస్తున్న యశ్ రాజ్ ఫిలింస్ ‘వార్-2’ను IMAX థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, యుకె, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌతీఈస్ట్ ఆసియా సహా భారతదేశంలో IMAX థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు నెక్ట్స్ లెవల్లో ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ చిత్రం అందించనుంది. WAR2కి సంబంధించి హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ల పోస్టర్లను నిర్మాణ సంస్థ విడుదల చేసింది.