
YouTuber Bayya Sunny Yadav: ప్రముఖ తెలుగు వ్లాగర్, బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఎట్టకేలకు తన అజ్ఞాతం వీడాడు. గత నెల రోజులుగా కనిపించుండా పోయిన ఈ ఇన్ ఫ్లుయెన్సర్ సడెన్ గా సింహాచలంలో ల్యాండ్ అయ్యాడు. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి కనిపించకుండా పోయిన భయ్యా సన్నీ విశాఖపట్నం చేరుకుని డైరెక్టుగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్నాడు. అంతే కాదు గుడి గోపురం ముందు ఫోటోలు దిగి నేను వచ్చేశా అంటూ ఆ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీంతో భయ్యా మిస్సింగ్ న్యూస్ కు ఎండ్ కార్డ్ పడినట్లైంది. అంతే కాదు వైజాగ్ ఎంట్రీతోనే భయ్యా సన్నీ ప్రపంచయాత్రికుడు అన్వేష్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అన్వేష్ టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అన్నా..నేను వచ్చేశా…మీ ఇంటికెళ్తా…మీ అమ్మానాన్నని కలుస్తా…నువ్వు టెన్షన్ పడకు అంటూ…పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు భయ్యా సన్నీకి…అన్వేష్ కి మధ్య ఉన్న పాత పగలేంటి ? వీరిద్దరికీ ఎక్కడ చెడింది. ? భయ్యా సన్నీ అన్వేష్ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? నెల రోజుల పాటు భయ్యా సన్నీ ఎక్కడున్నాడు?..ఎం చేశాడు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నెల రోజుల క్రితం చెన్నై ఎయిర్‌పోర్టులో సన్నీ భయ్యా కనిపించకుండా పోయాడు. చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే అతడిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. పాకిస్థాన్‌కు వెళ్లి దుబాయ్ మీదుగా చెన్నైకి వస్తుండగా సన్నీని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిందంటూ ప్రచారం జరిగింది. పాకిస్థాన్ ISIకి స్పైగా పనిచేశాడని సన్నీభయ్యాపై రూమర్స్ పెద్ద ఎత్తు సోషల్ మీడయాలో వచ్చాయి. యూట్యూబర్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తోందంటూ వార్తలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇదే క్రమంలో సన్నీకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ , ఫ్రెండ్స్ దగ్గర కూడా లేకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ లో జరిగిన జాకీర్ నాయక్ సమ్మిట్‌కు బయ్యా సన్నీ హాజరయ్యాడు. అయితే సన్నీ నిజంగా ఎన్‌ఐఏ అదుపులో ఉన్నాడా? లేదా? అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. బయ్యా సన్నీ తండ్రి మాత్రం కొడుకు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన సమయంలో సన్నీ యాదవ్ పాక్ లోనే ఉన్నాడు. ఉగ్రదాడి ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన నేపథ్యంలో భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలోని కొందరు యూట్యూబర్లు స్పై గా పనిచేస్తూ భారత రహస్యాలన్నింటినీ పాక్ కు చేరవేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. దీంతో వారిపై ఫోకస్ పెట్టారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, మరో 11 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు మరికొందరు యూట్యూబర్లపై నిఘా పెంచింది. ఇదే క్రమంలో పాక్ నుంచి సన్నీ యాదవ్ ఇండియాకు వచ్చాడు. పాక్ లో అతను పర్యటించిన ప్లేసెస్ ను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశాడు. పాక్ పర్యటనపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. ఇదే అతని కొంపముంచింది. సన్నీ యాదవ్ బైక్ మీద పాకిస్తాన్ వెళ్లడం ఆ వీడియోలను తన ఛానెల్ లో ఇలాంటి పరిస్థితుల్లో పోస్ట్ చేయడం పెద్ద ఇష్యూ అయింది. దీంతో సన్నీని ఎన్ఐఏ అధికారులు 29న చెన్నైలో అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. సన్నీ యాదవ్ అసలు పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లాడు? ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్ లో శత్రుదేశాన్ని సందర్శించడానికి కారణమేంటి? పాక్ లో ఏయే ప్రాంతాల్లో సన్ని పర్యటించాడు.? ఎవరిని కలిశాడు..? ఎందుకు కలిశాడు అనే కోణంలో అతడిని విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకున్న ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్..సన్నీ పై షాకింగ్ కామెంట్స్ చేసి తన పాత పగలను తీర్చుకునే ప్రయత్నం చేశాడు. సన్నీ దేశద్రోహి… పాకిస్థాన్ గూఢచారి..ఇవిగో ఫ్రూప్ లు అంటూ వీడియోలు షేర్ చేశాడు. సన్నీ యాదవ్ నిజంగానే NIA అదుపులో ఉన్నాడని చెప్పాడు.అన్వేష్ ఈ వీడియో షేర్ చేసిన కొద్ది రోజులకే సస్పెన్స్‌కు తెరపడింది. భయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు.అన్నయ్య నేనొచ్చేశా అంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు.అన్వేష్ కు సోషల్ మీడియాలోనే కౌంటర్ ఇచ్చాడు. భయ్యా వైజాగ్ వెళ్తున్నా.. మీ ఇంటికెళ్తా.. అమ్మానాన్నకి ధైర్యం చెబుతా.. నువ్వు టెన్షన్ పడకు అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతే కాదు లాస్ట్ నైట్ తనను ఎవరో కిడ్నాప్ చేశారని.. ఇప్పుడే విడిచిపెట్టారని సన్నీ పోస్ట్ లో రాసుకొచ్చాడు. వచ్చే నాలుగు రోజులు తనకు ఎంతో కీలకమైనవని…రెడీ టు ఫేస్ ఎవ్రీ థింగ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఇలా చెన్నైలో మిస్ అయిన భయ్యా సన్నీ సింహాచలంలో ప్రత్యక్షమవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. భాయ్ మిస్సింగ్ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడినా… నెల రోజుల పాటు భయ్యా సన్నీ ఎక్కడికి వెళ్లాడనేదానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇదే క్రమంలో సన్నీ అరెస్టు వార్తలు కేవలం పుకార్లేనా? లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని భీమిలికి చెందిన అన్వేష్..తెలంగాణకు చెందిన బయ్యా సన్నీ యాదవ్ వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి.వీరిద్దరికీ నెట్టింట్లో ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. వీరిలో నా అన్వేషణ అన్వేష్..ప్రపంచయాత్రికుడిగా 160 కిపైగా దేశాలను చుట్టేశాడు. వెళ్లే ప్రతి దేశంలో..అక్కడ ఉన్న విభిన్న ఆచార వ్యవహరాలను.. వారి లైఫ్ స్టైల్ చూపించే ప్రయత్నం చేసేవాడు. భయ్యా సన్నీ యాదవ్ బైక్ వివిధ దేశాలు వెళ్తూ..తన ట్రావెలింగ్ మూమెంట్స్‌ను పంచుకుంటూ ఉండేవాడు. అయితే ఈ టాప్ మోస్ట్ యూట్యూబర్ల మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా సన్నీ తను బైక్‌పై అమెరికాకు చేరుకున్నట్లు ఓ వీడియో పోస్ట్ చేశాడు. అదంతా ఫేక్ అని బైక్‌ను లాటిన్ అమెరికా వరకు షిప్‌లో పంపి.. అతను విమానంలో వెళ్లాడంటూ అవినాష్ కామెంట్స్ చేశాడు. దీంతో సన్నీ యాదవ్ చాలా వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు.ఆ తర్వాత వీరిద్దరి గొడవలు పర్సనల్ గా మారాయి. సన్నీ.. ఓ అమ్మాయిని మోసం చేశాడని.. ఆమె తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరినట్లు అన్వేష్ తెలిపాడు. అంతేకాదు ఓ పోలీస్ ఆఫీసర్ కుమార్తెను ట్రాప్ చేశాడని,బెట్టింగ్ యాప్స్‌ను ప్రొత్సహిస్తాడని, సన్నీ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శు చేశాడు అన్వేష్. అయితే తన పర్సనల్ విషయాలు తీయడంపై అవినాష్‌పై ఫైర్ అయ్యాడు. ఇలా వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా శత్రుత్వం పెరిగింది. అలా ఇప్పుడు సన్నీ యాదవ్ వైజాగ్ లో అన్వేష్ ఇంటికి వెళ్తానని చెప్పడంతో మరోసారి వీరిద్దరు హాట్ టాపిక్ అయ్యారు. ఇదిలా ఉంటే సన్నీ లేటెస్టు పోస్టుపై నా అన్వేష్ ఎలా రియాక్ట్ అవుతాడేనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతే కాదు వీరిద్దరి మధ్య గొడవకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందోనన్న చర్చ కూడా జరుగుతోంది. YouTuber Bayya Sunny Yadav