
వారే ఒప్పుకున్నారు. హీరో సల్మాన్ ను సైతం ఈ గ్యాంగ్ చంపేస్తామని బెదిరించడంతో .. బాలీవుడ్ స్టార్ సెక్యూరిటీ లేకుండా బయటకు రావడానికే భయపడుతున్నాడు. అలాంటి గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు భారత్ లో మోస్ట్ ఫేపస్ గ్యాంగ్ స్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. కాని ఇప్పటికీ సిద్ధూ మూసేవాలాను ఎందుకు చంపారో ఓ అంతుచిక్కని ప్రశ్నే. అయితే ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత సిద్ధు హత్యను ఎందుకు చేశారో గోల్డీ బ్రార్ క్లియర్ గా చెప్పాడు..? ఓ కబడ్డీ మ్యాచ్ సిద్దు హత్యకు కారణమైంది..? ఇంతకీ ఈ గ్యాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? పాపులర్ పంజాబీ హిప్-హాప్ స్టార్ సిద్దూ మూసేవాలాను హత్య చేయడానికి గోల్డీ చెప్పిన కారణాలు ఏంటి..? ఈ గ్యాంగ్ భారత్ లో చేస్తున్న దారుణాలు ఏంటి..? సల్మాన్ ఖాన్ ను వీరు ఎందుకు బెదిరించారు..?
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా బయటకు రావడం లేదు. దీనికి కారణం ఓ గ్యాంగ్ స్టర్ల బ్యాచ్ అతడిని చంపేస్తామని బెదిరించడంమే కారణం. మూడేళ్ల క్రితం ఇండియాను షేక్ చేసిన ప్రముఖ పంజాబీ హిప్ హాప్ స్టార్ సిద్ధూ మూసే వాలా మర్డర్ కేసులో కూడా ఇదీ గ్యాంగస్టర్ల బ్యాచ్ ఉంది. సిద్దూలానే సల్మాన్ ను చంపేస్తామని ఈ గ్యాంగ్ బెదిరించింది. అయితే మూడేళ్ల క్రితం జరిగిన సిద్దూ హత్య కేసులో ఇప్పుడు కొత్త నిజాలు బయటపడుతున్నాయి. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నే అప్పుడు సిద్దూ మూసేవాలాను హత్య చేసింది. అప్పట్లో ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ మ్యూజిక్ స్టార్, సెలబ్రెటీని చంపి.. ఈ గ్యాంగ్ ఫేమస్ అయ్యింది. ఈ మూడేళ్లుగా బెదిరింపులు, హత్యలతో బిష్ణోయ్ గ్యాంగ్ తరుచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా సిద్ధూ మూసేవాలా హత్యకు సంబంధించి బిష్ణోయ్ గ్యాంగ్ లో కీలక పనులు చేసే గోల్డ్ బ్రార్ కీలక విషయాలు బయటపెట్టాడు. ఓ అంతర్జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది.
2022 మే 29, పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసే వాలా తన బ్లాక్ మహీంద్రా థార్లో వెళ్తున్నాడు. మరో కారు సిద్ధూ కారును ఓవర్‌టేక్ చేసి, గోడకు ఢీకొట్టించింది. సెకండ్స్‌లో, గన్‌షాట్స్ స్టార్ట్ అయ్యాయి. ఏకే 47తో సిద్ధూపై కాల్పులు జరిపారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళే సరికి సిద్ధూ చనిపోయాడు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో, 24 బుల్లెట్స్ తగిలినట్టు నిర్ధారించారు. కొన్ని గంటల్లోనే, కెనడా బేస్డ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, ఫేస్‌బుక్‌లో ఈ హత్యకు తానే బాధ్యుడని ప్రకటించాడు. అయితే మూడేళ్లు గడిచినా, ఈ కేసులో ఎవరూ ట్రయల్ ఫేస్ చేయలేదు. గోల్డీ బ్రార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు గోల్డీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. హత్య సమయంలో గోల్డీ ఇండియాలో లేడు. సిద్ధూ అహంకారంతో కొన్ని తప్పులు చేశాడని.., అవి క్షమింరానివని… వేరే ఆప్షన్ లేక చంపేశామని గోల్డీ తెలిపాడు.
అసలు సిద్ధూ మూసేవాలా బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?
సిద్ధూ మూసే వాలా, అసలు పేరు శుభ్‌దీప్ సింగ్ సిద్ధూ. పంజాబ్‌లోని మూసా గ్రామంలో జాట్-సిఖ్ ఫ్యామిలీలో పుట్టాడు. 2016లో ఇంజనీరింగ్ చదవడానికి కెనడా వెళ్ళాడు. అక్కడే అతను పంజాబీ హిప్-హాప్‌లో ఎంటర్ అయ్యాడు. ఐదేళ్లలో, సిద్ధూ పంజాబీ మ్యూజిక్‌కి ఒక బ్రాండ్ అయ్యాడు. అతని స్వాగ్, ఫ్లాషీ స్టైల్, లిరిక్స్‌తో, గన్స్, రివెంజ్, ఐడెంటిటీ, పాలిటిక్స్ గురించి ఓపెన్‌గా సాంగ్స్ రాశాడు. అతని మ్యూజిక్ వీడియోస్‌కి యూట్యూబ్‌లో 5 బిలియన్ వ్యూస్, UK చార్ట్స్‌లో టాప్ 5, బర్నా బాయ్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులతో కొలాబ్స్. ఇండియా, కెనడా, UK, పంజాబీలో భారీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అది అతనికీ శత్రువులను కూడా పెంచింది. గోల్డీ, బిష్ణోయ్ గ్యాంగ్ సిద్ధూను చంపడానికి ఇదీ ఒక కారణం.
గోల్డీ, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీ ఆపరేటివ్. బిష్ణోయ్, ఇండియాలో హై-సెక్యూరిటీ జైలులో ఉన్నప్పటికీ, తన సిండికేట్‌ని మాత్రం రన్ చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా ఓ బాలీవుడ్ గ్యాంగస్టర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు. గోల్డీ 2017లో కెనడాకి స్టూడెంట్ వీసాపై వెళ్ళాడు. ట్రక్ డ్రైవర్‌గా వర్క్ చేశాడు. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ లిస్ట్‌లో ఉన్నాడు. 50కి పైగా మర్డర్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్. సిద్ధూ హత్య తర్వాత చాలా ఫేమస్ అయ్యాడు. అయితే సిద్ధూ తన ఫ్రెండ్ షగన్‌ప్రీత్ సింగ్ ద్వారా మిద్దుఖేరా హత్యలో ఇన్వాల్వ్ అయ్యాడని, అతను బిష్ణోయ్ రైవల్స్, బంబీహా గ్యాంగ్‌కి సపోర్ట్ చేశాడని గోల్డి ఆరోపించాడు.
గోల్డీ, సిద్ధూ గొడవ ఎలా స్టార్ట్ అయ్యింది?
సిద్ధూ ఫేమ్, అతడి యాటిట్యూడ్, విజిబిలిటీ వల్ల పంజాబ్‌లోని బిగ్ గ్యాంగ్‌స్టర్స్ దృష్టిలో పడ్డాడు. సిద్ధూ, బిష్ణోయ్‌తో 2018 నుండే టచ్‌లో ఉన్నాడు. సిద్ధూ, బిష్ణోయ్‌కి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజెస్ పంపేవాడని గోల్డి ఇంటర్వ్యూలో తెలపారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఓ కబడ్డీ మ్యాచ్ వీరు మధ్య గొడవకు కారణమైంది. బిష్ణోయ్ రైవల్స్ బంబీహా గ్యాంగ్ ఆర్గనైజ్ చేసిన కబడ్డీ టోర్నమెంట్‌ని సిద్ధూ ప్రమోట్ చేశాడు. దీంతో బిష్ణోయ్, గోల్డీ అప్‌సెట్ అయ్యారు. సిద్ధూని బిష్ణోయ్ బెదిరించాడు. అయితే ఈ గొడవను బిష్ణోయ్ గ్యాంగ్ లోని కీలకమైన మరో వ్యక్తి విక్కీ మిద్దుఖేరా సెటిల్ చేశాడు. కానీ 2021 ఆగస్ట్‌లో మిద్దుఖేరా మొహాలీలో గ్యాంగ్‌స్టర్స్ ల చేతిలో హత్య చంపబడ్డాడు. బిష్ణోయ్ రైవల్స్ అయిన బంబీహా గ్యాంగ్ ఈ హత్యకు కారణమని తెలిసింది. ఈ కేసులో పోలీసులు సిద్ధూ స్నేహితుడు ఒకరిని చార్జ్‌షీట్‌లో చేర్చారు. అయితే పోలీసులు సిద్దూకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. కాని బిష్ణోయో గ్యాంగ్ మాత్రం ఈ హత్య వెనుక సిద్ధూ కూడా ఉన్నాడని భావించింది. దీంతో సిద్దూ హత్యకు స్కెచ్ వేసింది.. ఇప్పటికే బిష్ణోయ్ గ్యాంగ్ తాము చేసింది కరెక్ట్ అని అనుకుంటోంది. సిద్ధూ లీగల్ సిస్టమ్ ను వాడుకుని తప్పించుకున్నాడని గోల్డి ఇంటర్వ్యూలో తెలిపాడు. అందుకే తామే హత్య చేయాల్సి వచ్చిందన్నాడు.
సిద్ధూ హత్య తర్వాత పంజాబ్‌లో ఈ గ్యాంగ్‌స్టర్స్ గ్రూప్ చెలరేగిపోయింది. బిష్ణోయ్, గోల్డీ లాంటి వాళ్ళు సిద్దూ హత్యకు ముందు లోకల్ లెవెల్‌లోనే ఉండేవాళ్ళు,. ఈ హత్య తర్వాత జాతీయ స్థాయిలో సెటిల్ మెంట్లు చేయడం మొదలుపెట్టారు.. సిద్ధూ హత్య తర్వాత.. మీడియా బిష్ణోయ్, గోల్డీని ఫేమస్ చేశాయి. ఇది వారికి గ్యాంగ్ స్టర్ బ్రాండ్ ను తెచ్చిపెట్టింది. అప్పటి వరకు పంజాబ్ లో మాత్రమే బెదిరింపులు, కిడ్నాప్ లుచేసిన ఈ గ్యాంగ్ ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం బెదిరించే స్థాయికి ఎదిగిపోయింది. గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ భారత్‌లో హత్యలు, ఎక్స్‌టార్షన్, ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ తరలింపు వంటి అనేక హై-ప్రొఫైల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. 2023 డిసెంబర్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామెడి జైపూర్‌లో హత్యకు గురయ్యాడు. దీనికి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ గోదారా బాధ్యత వహించాడు. 2024 అక్టోబర్‌లో మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ లింక్ ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. 2023 ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగాయి. వీటిని వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ ఉందని తెలింది. 2024 అక్టోబర్‌లో సల్మాన్‌కు ఎక్స్‌టార్షన్ డిమాండ్‌తో బెదిరింపు కాల్స్ వచ్చాయి. రూ. 5 కోట్లు చెల్లించాలని, లేదంటే సిద్ధూ మూసే వాలా లాంటి చావు ఎదురవుతుందని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. దీంతో సల్మాన్ ఖాన్ తన సెక్యూరిటీని పెంచుకున్నాడు. ఇప్పుడు సినిమా షూటింగ్ లు కూడా అవుట్ డోర్ లో తగ్గించేశాడు. ఎక్కడికి వెళ్లిన ఫుల్ సెక్యూరిటీతో వెళ్తున్నాడు.