
Prayagraj Honeymoon Crime Story: పెళ్లై కొత్తగా జీవితం మొదలెడితే, మొదటి రాత్రి కలల రాత్రి కావాలి. కానీ ప్రయాగ్‌రాజ్‌లో ఓ యువకుడికి కాళరాత్రి అయ్యింది. ఫస్ట్ నైట్ రోజు తనపై చేయి వేస్తే 35 ముక్కలుగా నరికేస్తానని పెళ్లికూతురు అతడిని బెదిరించింది. అంతే కాదు తన శరీరం తన ప్రియుడు అమన్ కు మాత్రమే సొంతమని చెప్పింది. దీంతో ఆ పెళ్లికొడుకు షాక్ తిన్నాడు. భయంతో నిద్ర లేకుండా మూడు రాత్రులు గడిపాడు. ఇప్పటికే మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసుపై దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. అసలు ఈ భార్యలకు ఏమైంది..? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని.. భర్తలను స్కెచ్ వేసి చంపేయడాన్ని ఎలా చూడొచ్చు..? ఇలాంటి ప్లాన్స్ వేసే వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి..? అసలు ఇలాంటి కేసుల్లో తప్పు ఎవరిది..? పోలీసులు తమను పట్టుకోలేరులే అని తప్పులు చేసి.. చిక్కుల్లో పడుతున్నారా..? మారుతున్న సమాజంలో వివాహంపై విలువ తగ్గడానికి, బంధాలపై అనుమానాలు కలగడానికి ఈ ఘటనలు కారణమవుతున్నాయా..?
గతంలో భార్యలను కట్నం కోసమో.. అనుమానంతోనో భర్తలు హత్య చేసిన ఘటనలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు భర్తలను భార్యలే స్కెచ్ వేసి లేపేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. మేఘాలయ హనీమూన్ మర్డర్, తెలంగాణలోని గద్వాల జిల్లాలో తేజేశ్వర్ హత్య.. ఇలాంటివే .. వేరొకరిని ప్రేమించడం తల్లిదండ్రులు ప్రేమకు ఒప్పుకోకపోవడంతో బలవంతంగా పెళ్లి చేసుకోవడం.. తర్వాత భర్తలను ప్రేమికుడితో కలిసి చంపేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. భర్త చనిపోతే ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవించవచ్చని అనుకుంటున్నారు కాని ఆ తర్వాత పోలీసులకు దొరికితే జైలులో గడపాల్సిందేననే విషయాన్ని మర్చిపోతున్నారు. అయితే మేఘాలయ హనీమూన్ ఘటన మరువక ముందే ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫస్ట్ నైట్ రోజే పెళ్లి కూతరు .. పెళ్లి కొడుకును కత్తితో చంపేస్తానని బెదిరించింది. కారణమేంటని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది.
ప్రయాగ్‌రాజ్‌లో కెప్టెన్ నిషాద్ అనే యువకుడు, సితారా అనే యువతని ఏప్రిల్ 29న పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్ 30న సితారా అత్తింటికి వచ్చింది. మే 2న పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసి బంధువలను అందరినీ పిలిచారు. ఆ రోజు రాత్రే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అయితే నిషాద్ గదిలోకి వెళ్లగానే, సితారా చేతిలో కత్తి పట్టుకుని, నన్ను తాకొద్దు! నా శరీరం అమన్‌ది. తాకితే 35 ముక్కలు చేస్తా అని బెదిరించింది. నిషాద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ రాత్రి సోఫాపై కూర్చుని, సితారా కత్తితో నిద్రపోయే వరకు భయంతో గడిపాడు. మూడు రోజులు ఇదే భయం. సితారా రాత్రి పొద్దుపోయాక నిద్రపోతే, నిషాద్ కళ్లు తెరిచి కాపలాగా ఉండేవాడు. మూడో రోజు, నిషాద్ తన తల్లికి ఈ విషయం చెప్పాడు. సితారాను నిలదీస్తే, అసలు విషయం చెప్పింది, తాను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని… తన కుటుంబం ఒత్తిడి చేయడం వల్లే ఈ పెళ్లి చేశానని… తన తొలి రాత్రి అమన్‌తోనే జరగాలని చెప్పింది. ఈ మాటలు నిషాద్ కుటుంబాన్ని షాక్‌కు గురిచేశాయి. Prayagraj Honeymoon Crime Story.
ప్రయోగారాజ్ లో సితారా నిషాద్ ను కేవలం బెదిరించింది. కానీ రాజా రఘువంశీ, సోనమ్ కేసులో… తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో భార్యలు ఏకంగా భర్తలను సుఫారీ గ్యాంగులతో మర్డర్ చేయించారు. మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశి, సోనమ్ లు మే 11న పెళ్లి చేసుకున్నారు. మే 20న హనీమూన్‌కి మేఘాలయ వెళ్లారు. మే 23న ఇద్దరూ అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం సోహ్రా ప్రాంతంలోని ఒక లోయలో కనిపించింది. సోనమ్ మాత్రం కనిపించలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తే, షాకింగ్ నిజం బయటపడింది. సోనమ్ తన ప్రియుడు రాజ్ కుశ్వాహతో కలిసి, ముగ్గురు సుపారీ హంతకులను నియమించి రాజాను చంపించింది. ఆమె రూ.20 లక్షలు ఇచ్చి ఈ హత్యను ప్లాన్ చేసింది. జూన్ 8న సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో లొంగిపోయింది. ఆమెతో పాటు రాజ్ కుశ్వాహ, ముగ్గురు హంతకులు అరెస్టయ్యారు.
తాజాగా తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌కు చెందిన ఐశ్వర్యను మే 18న పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి తేజేశ్వర్ కుటుంబం ఒప్పుకోలేదు, ఎందుకంటే ఐశ్వర్య ఫిబ్రవరిలో ఒక వారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయినా, ఐశ్వర్య తిరిగి వచ్చి తేజేశ్వర్‌ను ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ, పెళ్లి తర్వాత ఐశ్వర్య ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడటం తేజేశ్వర్‌కు నచ్చలేదు. జూన్ 17న, తేజేశ్వర్‌ను ల్యాండ్ సర్వే కోసం అని చెప్పి ఒక కారులో తీసుకువెళ్లారు. అక్కడే అతని గొంతు కోసి చంపి, శవాన్ని కాలువలో పడేశారు.
పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ముగ్గురు హంతకులను అరెస్ట్ చేశారు. ఐశ్వర్య ప్రియుడు తిరుమల రావు, ఒక బ్యాంకు ఉద్యోగి, ఈ హత్యకు సూత్రధారిగా గుర్తించారు.
ఈ హత్యలు సమాజంలో తగ్గిపోతున్న భార్యభర్తల బంధం విలువకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సితారా తన ప్రేమను బహిరంగంగా చెప్పింది, కానీ కత్తితో బెదిరించడం ఆమె మానసిక స్థితిని తెలియజేస్తోంది. సోనమ్, ఐశ్వర్యలు సుపారీ హంతకులను ఉపయోగించి, తమ భర్తలను చంపించారు. కానీ, పోలీసులు వారిని సులభంగా పట్టుకున్నారు. సితారా, సోనమ్, ఐశ్వర్య కథలు చూడటానికి ఒకేలా ఉన్నాయి. ఒకే ప్రేమ, బలవంతపు పెళ్లిళ్లు, హత్యలు. చాలా మంది యువతులు తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో, ఒత్తిడితో పెళ్లి చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా పెళ్లి ఇష్టం ఉందా లేదా అని పట్టించుకోకుండా.. కూతురు ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే పరువుపోతుందనే భయంతో ఎరేంజ్ మ్యారేజ్ లు చేస్తున్నారు. ఆ తర్వాత ఏం వచ్చినా భర్త ఖాతాలోకి పోతుందని అనుకుంటున్నారు. కాని ఆ తర్వాత జరిగే ఘటనలు పరువును ఇంకా దారుణంగా తీస్తున్నాయి. అయితే సోనమ్, ఐశ్వర్య కేసుల్లో ప్రియుడితో జీవించాలనే ఆశతో, భర్తను చంపేస్తే సుఖంగా ఉండొచ్చని అనుకున్నారు. అయితే, ఇది పెద్ద తప్పు. పైగా ఇలాంటి మర్డర్ కేసుల్లో శిక్ష చాలా కఠినంగా ఉంటుంది.. అప్పుడు భర్తా ఉండడూ.. ప్రేమికుడు ఉండడు. జైల్లో నరకం అనుభవించాలి.. ప్రియుడితో స్వర్గం కోసం భర్తలను హత్య చేసి.. మంచి జీవితాన్ని నాశనం చేసుకుని.. చివరికి జైల్లో నరకం కంటే ఘోరమైన జీవితాన్ని గడపుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసులను, దర్యాప్తును తక్కువ అంచనా వేయడం వల్ల నిందితులు దొరికిపోతున్నారు.. స్కెచ్ వేసి మర్డర్ చేసేసి అమాయకంగా నటిస్తే.. ఎవరికీ దొరకలేం అనుకంటే అది అవివేకమే.. ఒక వ్యక్తి హత్య జరిగినప్పుడు ముందుగా పోలీసులు అనుమానించేది భర్త లేదా భార్యనే. వారు ఎన్ని కథలు చెప్పినా.. వీరి నడవడిక పోలీసులకు అర్థమైపోతుంది. ఇక
Also Read: https://www.mega9tv.com/crime/wife-kills-husband-in-the-name-of-honeymoon/