
జ్యోతిష్యంలో కేతు గ్రహాన్ని ఒక ఛాయాగ్రహంగా చెప్తారు. ఇది ఆధ్యాత్మికత, వైరాగ్య, కర్మ సంబంధిత విషయాలతో ముడిపడి ఉంటుంది. కేతు గ్రహం అనుకూల స్థానంలో లేన్నప్పుడు, ఇది ఆ వ్యక్తుల్లో బాగా ప్రభావం చూపిస్తుంది. గందరగోళం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక అస్థిరత, మానసిక అశాంతి వంటివి కలుగుతాయి. కేతు గ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే కొంత ఈ ప్రభావం నుంచి బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కేతు గ్రహం సాధారణంగా బూడిద రంగు (స్మోకీ గ్రే) లేదా గోధుమ రంగుతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కేతు గ్రహం కుజుడు లేదా ఇతర గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఎరుపు రంగు సంబంధిత పరిహారాలు చేస్తే మంచిది. ఎందుకంటే ఎరుపురంగు కుజ గ్రహంతో ముడిపడి ఉంటుంది. కేతు కొన్ని లక్షణాల్లో అంగారకుడిని పోలి ఉంటుంది. కాబట్టి ఎరుపు రంగు శక్తి, ధైర్యం ఇవ్వడంతో పాటు, కర్మ శుద్ధీకరణను సూచిస్తుంది. ఇది కేతు గ్రహం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పరిహారాలు పాటించేటప్పుడు.. శ్రద్ధ, భక్తితో పాటు సరైన రీతిలో పాటించడం చాలా ముఖ్యం.
- కేతు గ్రహానికి సంబంధించిన దోషాలను తగ్గించడానికి, ఎరుపురంగు సంబంధిత వస్తువులను దానం చేయడం అనేది ఒక ప్రభావవంతమైన పరిహారం.
- ఉదా: ఎరుపురంగు వస్త్రాలు, పుష్పాలు, ఎరుపు చందనం లేదా ఎరుపు పగడం (రెడ్ కోరల్) వంటి వస్తువులను మంగళవారం లేదా శనివారం రోజున గుడిలో లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయవచ్చు. ఈ దానం కేతు కర్మ సంబంధిత ప్రభావాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
- కేతు గ్రహశాంతి కోసం గణేశుడిని పూజించడం అనేది గొప్ప పరిహారం. ఎందుకంటే గణేశుడు కేతు గ్రహానికి అధిపతిగా పరిగణిస్తారు. ఈ పూజలో ఎరుపు రంగు పుష్పాలను (గులాబీ, హైబిస్కస్) సమర్పించడం ద్వారా కేతు ప్రతికూల శక్తిని తగ్గించవచ్చు. మంగళవారం రోజు ఈ పూజ చేయడం ద్వారా కేతు గ్రహ దోషాలు తగ్గుతాయి.
- ఎరుపు చందనం కేతు గ్రహానికి సంబంధించిన పరిహారాలలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది అంగారకుడి శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. రోజూ ఉదయం ఎరుపు చందనం తిలకం నుదుటన ధరించడం లేదా గణేశ్ పూజ సమయంలో ఎరుపు చందనాన్ని సమర్పించడం కేతు ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది మానసిక శాంతి, ఆధ్యాత్మికతను పెంచుతుంది.
- కేతుగ్రహ శాంతి పూజలో ఎరుపురంగు వస్తువులను ఉపయోగించడం మేలు చేస్తుంది. ఉదా: పూజ సమయంలో ఎరుపు రంగు వస్త్రంపై గణేశ యంత్రాన్ని ఉంచడం లేదా ఎరుపు రంగు దీపం వెలిగించడం ద్వారా కేతు సానుకూల శక్తిని పెంచవచ్చు. ఈ పూజను అనుభవజ్ఞులైన పండితుల సమక్షంలో మంగళవారం లేదా శనివారం రోజు చేయడం మంచిది.