
కష్టం, సుఖం.. ఏదీ శాశ్వతం కాదు, శ్వాసకు మల్లే వస్తూ పోతూ ఉంటాయి. బుద్ధుడు ‘ప్రతిదీ అశాశ్వతం’ అనే సూత్రాన్ని నొక్కి చెప్తున్నాడంటే అర్థం.. తాత్కాలిక కోరికల నుంచి బయటికొచ్చి జీవిత పరమార్థాన్ని గ్రహించాలనుకోవడమే! ఆయన ప్రబోధించిన ముఖ్య సూక్తులు మన నిత్య జీవితానికి అన్వయించుకుంటే మన భవిష్యత్తుకి గొప్ప సోపానాలు అవుతాయి.
- కాలాన్ని వృధా చేయడమంటే, నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.
- మన లోపల శత్రువు లేనంతవరకు, బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు.
- మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల వల్లే.
- ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్లుగానే, మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణమవ్వాలి.
- తమపై తాము విజయం సాధించినవారే అసలైన విజేతలవుతారు.
- నిజం మాట్లాడండి. కోపాన్ని దరిచేరనీయకండి.
- మీ దగ్గర ఉన్నంతలో సాయం చేయండి.
- ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు.
- మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి.