
మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో విదురుడు చెప్పిన నీతి వాక్యాలివే..
- తనకు అందని దాని గురుంచి ఆరాటపడనివాడు, పొయినదాని గురుంచి బాధపడనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే.. జ్ఞాని.
- అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు ఎప్పటికీ వినయంగానే ఉంటాడు.
- మూర్ఖుడు.. వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ.. ఆలస్యంగా చేస్తాడు. అతను తప్పు చేసి, ఎదుటివారిని నిందిస్తాడు.
- ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటం.. ఈ రెండూ విషయాలు మనిషిని కృశింపజేస్తాయి.
- ఏదైనా కష్టం వస్తే ఒక్కడే కూర్చొని బయటపడే ఉపాయం గురుంచి ఆలోచించకూడదు.
- అందరూ నిద్రపోతుంటే, తానొక్కడే మెలకువగా ఉండకూడదు.
- మధుర పదార్థం నలుగురికి పంచకుండా ఒక్కడే తినకూడదు.
- ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికొచ్చే విద్య.. ఇవి మనుషులకున్న సుఖాలు.
- శత్రువుల్ని దూరం పెట్టినంత మాత్రాన హాని జరగదని భావించొద్దు. వారి విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
- బలవంతుడితో విరోధం పెట్టుకున్నవాడికి, సంపద పోగొట్టుకున్నవాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు.