ఆదివారం ఏం చేయాలి అంటే?

దేవుడిని నమ్మి కొన్ని పనులు చెయ్యడం వల్ల కష్టాల నుంచి గట్టెక్కుతామని నమ్ముతాం. అందుకే బాధలు, కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది పరిహారాలు పాటిస్తారు. దీనివల్ల మానసిక ఊరట లభించడంతోపాటూ.. కష్టాల నుంచి మనసు పాజిటివ్ విషయాలవైపు మళ్లుతుంది.
ఆదివారం రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. అవేంటో చూద్దాం…

*ఆదివారం సూర్య భగవానుడికి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు ప్రత్యేకించి సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. సూర్యభగవానుడికి కొన్ని పరిహారాలు పాటిస్తే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు.
*ఈరోజు ఉదయం స్నానం చేసి తూర్పు వైపు తిరిగి నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి. అర్ఘ్యాన్ని సాధారణంగా అయినా సమర్పించవచ్చు లేదా నీరు పారే ప్రాంతంలో అయినా సమర్పించవచ్చు. ఇలా చేయడం చాలా మంచిది. అర్ఘ్యం సమర్పించేటప్పుడు
‘ఓం సూర్యాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ఆదిత్యాయ నమః’ అనే మంత్రాలు జపిస్తే మంచి జరుగుతుంది.
*ఆదివారం రోజు బెల్లం, పాలు, బియ్యం, ఎరుపు రంగువస్త్రాలు, రాగి పాత్రలు దానం చేయడం వల్ల జాతకంలో గ్రహాల దశ మారుతుంది.
*ఈరోజు ఇంటి ప్రధాన గుమ్మం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో ఉన్న చెడు శక్తి పోతుంది.
*ఆదివారం పూజ చేసిన తరువాత చందన తిలకాన్ని నుదుటన ధరించాలి. ఇలా చేయడం వల్ల పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శాస్త్రీయంగా చూస్తే చందన తిలకాన్ని నుదుటన ధరిస్తే జ్ఞానచక్రం చైతన్యం అవుతుంది. ఇది పాజిటివ్ ఆలోచనలు మనలో పెంచుతుంది.