
జ్యోతిష్యశాస్త్రంలో నవ గ్రహాల్లో శని, రాహు, కేతువులు చెడు ప్రభావాలను కలిగించే గ్రహాలుగా చెప్పడం మనం విన్నాం. అయితే ఇటువంటి వాటికి కొన్ని రకాల పరిహారాలు ఉంటాయి. అలా ఈ గ్రహాల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో వేప చెట్టు సహాయపడుతుందని ఒక నమ్మకం. అయితే వేప చెట్టుని ఇంటి ఆవరణలో నాటే సమయంలో ఉన్న వాస్తు నియమాల గురుంచి తెలుసుకుందాం..
ఎవరైనా శని లేదా రాహు-కేతువుల చెడు ప్రభావాలను ఎదుర్కొంటున్నట్లయితే వారికి వాస్తు శాస్త్రంలో పేర్కొన్న పరిష్కారం.. వేపచెట్టు నాటడంమన హిందూ సాంప్రదాయం ప్రకారం వేపచెట్టును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తాం. వేప చెట్టుకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. అంతేకాదు ఉగాది వంటి పర్వదినాల్లో ఉగాది పచ్చడిలో కీలక పాత్ర పోషిస్తూ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వేప చెట్టుని సరైన దిశలో పెంచడం వల్ల గ్రహ దోషాలు తొలగి.. ఇంటికి మంచి శ్రేయస్సు వస్తుంది.
వేప చెట్టు దగ్గర ప్రతికూల శక్తి ఉండలేదు. ఇది రాహువు, కేతువు, శనిశ్వరుడి ప్రభావాలను తగ్గించడమే కాక సానుకూలత, సంపదను కూడా తెస్తుంది. ఇంటి బయట వేప చెట్టును నాటడం వల్ల చెడు దృష్టి, పూర్వీకుల శాపం, శని-కుజుడు శాపం నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
“వేప మొక్కను నాటడానికి దక్షిణ దిశ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పెద్దలు చెబుతారు. ఈ దిశలో మొక్కను నాటడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం కలుగుతుంది. అంతేకాక వేప చెట్టు మహాలక్ష్మి స్వరూపం కూడా. ఉత్తర భారత దేశంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేప చెక్కతో హవనము చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయని నమ్మకం. వేప ఆకులను కాల్చడం వల్ల ప్రతికూల శక్తులు నశిస్తాయి.