ఎంత నిద్రపోతే అంత ఆరోగ్యం …

ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం చాలామంది చాలా రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు….శారీరక మానసిక ఆరోగ్యం రెండు కూడా నిద్రలో దాగి ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మన హార్మోన్లను నియంత్రించడంలో జ్ఞాపకశక్తిని పెంచడంలో ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రతను పెంచడంలో ఒత్తడిని అధికమించడంలో…ఇలా ఒకటా రెండా ఎన్నో రకాల మేలు చేకూరుస్తుందట సుఖవంతమైన నిద్ర.మరి ఆ నిద్ర ఎంతసేపు పోవాలి అంటే 7 నుంచి 9 గంటలు తప్పనిసరి అని శాస్త్రవేత్తలు నిపుణులు తెలియజేస్తున్నారు. కనీసం 6:30 నుంచి 7 గంటలైనా తప్పక నిద్రపోవాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి అని కూడా స్పష్టం చేస్తున్నారు నిపుణులు. నాణ్యమైన నిద్ర కోసం రాత్రి వేళల్లో స్క్రీన్లు చూడటం మానేయాలని గట్టిగా చెబుతున్నారు. రాత్రివేళల్లో కెఫెన్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు అని డాక్టర్స్ సూచిస్తున్నారు. నిద్ర రాని వాళ్ళు మందులకు అలవాటు పడకుండా యోగా ,ధ్యానం లాంటివి చేయడం వల్ల రిలాక్సేషన్ కలుగుతుందని ఇలాంటివి ప్రాక్టీస్ చేయటం చాలా ఉత్తమమని చెప్తున్నారు. ఇక బెడ్ రూమ్ ని చీకటిగా , చల్లగా ఉంచటం సౌకర్యవంతమైన నిద్రకు దోహదపడుతుందని డాక్టర్స్ సూచిస్తున్నారు. మరి ఇక నుంచి ఇవన్నీ పాటించడి. సుఖవంతమైన నిద్ర మీ సొంతం చేసుకోండి. ఆరోగ్యంగా జీవించండి.