అలోవెరా.. హెల్త్ కోసం కూడా!

అలోవేరా నేడు ప్రతి ఇంట్లో ఉంటున్న కామన్ మొక్క. ఈజీగా ప్లేస్ చేయడం, అలంకరణకు, అందానికి ఉపయోగపడటంతో.. అందరూ ఈ మొక్కను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ మొక్క ఎక్కువగా గుబురుగా విస్తరిస్తుంది. ఊష్ణ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. దీనిని తెలుగులో కలబందగా పిలుస్తారు. వందల సంవత్సరాలుగా వైద్యపరంగా దీనిని వినియోగిస్తున్నారు. ఈ మొక్కలో మెత్తగా, గుజ్జులా ఉండే మిశ్రమం చాలా రకాల చికిత్సలకి నేటికీ వాడుతున్నారు. ప్రాచీన కాలం నుంచి ఇందులో ఉండే రసాయన పదార్ధం, జెల్ వైద్యపరంగా ఉపయోగపడుతుంది. వివిధ పద్దతులలో దీనిని రకరకాల ట్రీట్మెంట్ లలో వాడుతున్నారు.

  • దీని నుంచి వచ్చిన రసాన్ని పూర్తిగా ఫిల్టర్ చేసి అలోవెరా జ్యూస్ గా తీసుకుంటున్నారు.
  • ఇటీవలి కాలంలో అలోవెరా జ్యూస్ డయాబెటిస్ నివారణకు వినియోగిస్తున్నారు.
  • అలోవెరా మన శరీరంలోని పీహెచ్ శాతాన్ని సమతుల్యం చేస్తుంది.
  • లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
  • దీనిలో ఫైటో న్యూట్రియెంట్లు ఉండడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
  • ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగి, హెల్తీగా ఉంచుతుంది.
  • పేగుల్లో, ఛాతీలో మంటగా ఉంటె కొంచంగా అలోవెరా జ్యూస్ తీసుకోండి. ఉపశమనంగా ఉంటుంది.
  • గ్యాస్ట్రిక్, అల్సర్ ను సమర్ధంగా ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది.
  • చర్మ సంబంధిత సమస్యకు తక్షణ నొప్పి నివారణిగా పనిచేస్తుంది.