రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఇవి చేయండి!

ఎక్కువశాతం ఆడవాళ్ళు ఎదుర్కొనే మోస్ట్ కామన్ సమస్య రక్తహీనత. సాధారణంగా 12 శాతం ఉండాల్సిన రక్తం ఒకొక్కరికి 6 లేదా 5కి కూడా పడిపోయినపుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చెప్పనలవి. ఎప్పుడయితే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన ప్లేస్ ని వాటర్ ఆక్యుపై చేసి ఒళ్ళు బరువెక్కటం, కాళ్ళు తిమ్మెర్లు, కూర్చుని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండటం, అధిక రక్తస్రావం ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. జనరల్ గా మంత్లీ మెన్సస్, ప్రెగ్నెన్సీ టైమ్ లో ఎక్కువ రక్తం అవసరం ఉంటుంది. అటువంటప్పుడు నేచురల్ గా హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఇవి పాటించాలి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.

మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, బి12 ఇలాంటివాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా ఫుడ్ అండ్ రెగ్యులర్ హ్యాబిట్స్ మార్చుకుంటే చాలు, ఎలాంటి సమస్య ఉండదు.

రక్తహీనతతో బాధపడేవారు డాక్టర్ దగ్గరకి వెళితే ఐరన్ లేదా విటమిన్లతో కూడిన టాబ్లెట్స్ రాసి, ఇస్తారు. అవి వాడితే సమస్య తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. అవి వాడటం ఆపగానే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది.

ఇందుకోసం ఫ్రెష్ పాలకూర, మెంతికూర, పెసరపప్పు, రాజ్మా, బీన్స్ మొదలైనవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. నువ్వులు, బార్లి, బాదం పప్పు తినటం కూడా మంచిది. మాంసాహారులైతే ఎర్ర మాంసం, చేపలు తింటే మంచిది.

కొన్ని సందర్భాల్లో బాడీలో విటమిన్ సి తక్కువగా ఉండి దానివల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గుతున్నట్లయితే గనుక జామకాయలు, బొప్పాయి, కివి, ఆరెంజ్, ద్రాక్ష తీసుకోవాలి. అదే కూరగాయల్లో కాప్సికమ్, క్యాబేజ్, టమాటా ఎక్కువగా తినాలి.

బాదం పప్పు రక్తాన్ని పెంచటంలో ఎక్కువ హెల్ప్ చేస్తుంది. రోజుకి 10 లేక 12 బాదంపప్పులు నానబెట్టుకుని తినడం అలవాటు చేసుకోవాలి. బీట్ రూట్ రక్తహీనతకు తిరుగులేని మందుగా చెబుతారు. ఉదయం పూట ఒక గ్లాస్ పచ్చి బీట్ రూట్ జ్యూస్ ను తయారు చేసుకొని ఒక 20 రోజుల పాటు తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే బ్రౌన్ బ్రెడ్, పాస్తా, కార్న్ ఫ్లాక్స్ కూడా బ్లడ్ ను ప్రొడ్యూస్ చేస్తాయి.