విటమిన్ డి లోపం మీలో ఉందా..!

మనం హెల్తీగా, ఫిట్ గా ఉండటానికి చాలా రకాల విటమిన్లు, ఎంజైమ్ లు, పోషకాలు, ప్రోటీన్, ఫైబర్ వంటివి చాలా అవసరం. వేసవి కాలమే అయినా.. ఒక్కోసారి సూర్యుడి ఉనికి చాలా తక్కువగా ఉంటుంది. దానికితోడు షిఫ్ట్ డ్యూటీలు, ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్ళేవారిలో ఎక్కువగా విటమిన్- డి లోపం ఏర్పడుతుంది. శరీరానికి సూర్యుడి లేత కిరణాలు తగిలినప్పుడు విటమిన్-డి అనేది జనరల్ గా ఉత్పత్తి అవుతుంది. కానీ సూర్యరశ్మి సరిగా అందకపోతే విటమిన్-డి లోపం ప్రభావం చూపిస్తుంది. అదెలాగంటే..

  • శరీరం అలసటకు గురైనప్పుడు.. సరిగా విశ్రాంతి తీసుకున్నా.. స్లీప్ సైకిల్ సరిగా ఉన్నా.. టైంకి తిన్నా కూడా కొందరు అలసటగా ఫీల్ అవుతుంటారు. అలా అనిపిస్తుంటే మాత్రం అది విటమిన్-డి లోపానికి ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు.
  • శరీరం కాల్షియంను గ్రహించాలన్నా, ఎముకలు దృఢంగా ఉండాలన్నా విటమిన్-డి చాలా అవసరం. కాళ్లు, వెన్ను, కీళ్లు, కాలి కండరాలు బలహీనంగా ఉండటం, పట్టేయడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటే అది కూడా విటమిన్-డి లోపం మూలానే అని తెలుసుకోండి.
  • ఎముకల నొప్పి, బలహీనత, ఎముకలు పెళుసుగా ఉండటం, నడుస్తున్నప్పుడు లేదా ఇతర పనులు చేస్తున్నప్పుడు ఎముకలు ఫట్ ఫట్ మని శబ్దం రావడం జరుగుతుంటే శరీరంలో విటమిన్-డి లోపం ఉన్నట్లే అని అర్థం చేసుకోండి. ఎందుకంటే విటమిన్-డి ఉంటేనే శరీరంలో కాల్షియం ఏర్పడుతుంది. అది సరిపడా లేనప్పుడే ఇలా అవుతుంది.
  • చాలామందికి ఉన్నట్టుండి మూడ్ మారిపోతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకుగా, కోపంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారికి విటమిన్-డి లోపం ఉండే అవకాశం ఉంటుంది. మూడ్ స్వింగ్స్ కూడా విటమిన్-డి లోపానికి కారణమే. ఎందుకంటే సరైన విధంగా విటమిన్ డి లేనప్పుడు శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగేలా చేస్తుంది.
  • జుట్టు పలుచగా మారుతున్నా, ఎక్కువగా రాలిపోతున్నా, బలహీనంగా మారుతున్నా అది విటమిన్-డి లోపానికి సంకేతమే..
  • శరీర రక్షణ వ్యవస్థ బలంగా ఉండటంలో విటమిన్-డి చాలా సహాయపడుతుంది. విటమిన్-డి లోపిస్తే తరచుగా జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు వంటివి వస్తుంటాయి.
  • రోజువారీ విటమిన్ డి కోసం కేవలం 8 నుంచి 15 నిమిషాల వరకూ ఎండలో ఉంటే చాలు. వీటితో పాటు నేచురల్ గా దొరికే పుట్టగొడుగులు, సీ ఫుడ్స్ లో ఫ్యాటీ ఫిష్, గుడ్లు, బాదం, సోయా మిల్క్, ఆవుపాలు, నారింజ, పెరుగు వంటివి రెగ్యులర్ గా తీసుకోవాలి.