చెడు కొలెస్ట్రాల్ లక్షణాలను గుర్తించండిలా..?!

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతున్నకొద్దీ ముప్పు పెరుగుతూ ఉంటుంది. ఇది మరింత తీవ్రమైతే ప్రాణాలు సైతం రిస్క్​లో పడే ప్రమాదముంది. అందుకే, కొలెస్ట్రాల్​ ను కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాడీలో కొవ్వు మోతాదు పెరుగుతున్నప్పుడు శరీరం 9 రకాల హెచ్చరికలు చేస్తుందని, వెంటనే అలర్ట్​ కావాలని చెబుతున్నారు. మరవేంటో ఇప్పుడు చూద్దాం.

  • ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం ఏర్పడటం. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు ఇలా అనిపించే ఛాన్స్ ఉంది.
  • కాళ్ళలో నొప్పి లేదా తిమ్మిరి అనేది ఎక్కువసేపు నడుస్తున్నప్పుడు లేదా నిల్చున్నప్పుడు వస్తుంది.
  • కళ్ళు, మోకాలు, మోచేతుల చుట్టూ చర్మం పసుపు రంగులోకి మారుతుంది.
  • మైకం లేదా మైగ్రేన్ తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి.
  • ఛాతీ నొప్పితోపాటు శ్వాస ఆడకపోవడం. చాలా నీరసంగా ఉన్నట్టు, అలసిపోయినట్టు అనిపించడం.
  • తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుంది. సరిగా జీర్ణం కాదు. పొట్టలో బాధాకరంగా అనిపిస్తుంది.
  • దవడ, ఇంకా మెడ వెనుక భాగంలో నొప్పి.

ఈ లక్షణాలుంటే అప్రమత్తంగా ఉండాలి.
నేటి కాలంలో శరీరంలో LDL చెడు కొలెస్ట్రాల్
పెరగడమనేది ఒక సాధారణ సమస్య. అన్ని వయసులవారూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సరికొత్త ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలవుతున్నాయి.
అధిక కొలెస్ట్రాల్ అనేది సైలెంట్​ కిల్లర్‌గా మారుతోందని, తెలియకుండా ప్రాణాలు తీసేస్తుంది. ఈ నేపథ్యంలో అవగాహన అవసరం.

కొలెస్ట్రాల్ వల్ల స్థూలకాయం పెరుగుతుంది. ఇది మొదటగా రక్తసరఫరాలో ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. బీపీ పెరగడంతోపాటు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలకు దారి తీస్తుంది.
జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని సూచిస్తున్నారు.