ఫ్రీక్వెంట్ మీల్స్.. తినండి!

శరీరం బ్యాలెన్స్డ్ గా, హెల్తీగా ఉండాలంటే అందులో కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు, మినరల్స్‌, విటమిన్స్ అనే ఐదు భాగాలు సరైన మొత్తంలో ఉండాలి. ఒక వ్యక్తి ఎంత ఆహారం తీసుకోవాలనేది ఆ వ్యక్తి బరువు, ఎత్తు, జెండర్ తో పాటు అతడి పనిపైన ఆధారపడి ఉంటుంది. శారీరక శ్రమ చేసేవాళ్లు కొంచెం ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. సాధారణమైన అంచనాల ప్రకారం, రోజూ మగవారు 2,500 క్యాలరీలు, స్త్రీలు 2,000 క్యాలరీలు, పిల్లలు 1200 నుంచి 1400 క్యాలరీల ఆహారం అనేది తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా, అతిగా తినటం కంటే చిన్న చిన్న విరామాలతో రోజులో ఎక్కువసార్లు తినటం వల్ల శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం, రాత్రి తీసుకునే ఆహారం మధ్య కనీసం ఆరు గంటల విరామం ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆహారం జీర్ణం కావటానికి తగినంత సమయం దొరుకుతుంది. ఈజీ డైజెషన్ అవుతుంది. స్టమక్ హెల్తీగా ఉంటుంది.

మన పూర్వీకులు ఆహారం తినటానికి అరటి, తామర, మోదుగు ఆకులను వాడేవారు. ఈ ఆకుల్లో తినటం వల్ల అవి పరోక్షంగా లాలాజాలాన్ని ఉత్పత్తి చేసేవి. ఫలితంగా జీర్ణక్రియ బాగా అయ్యేది. ఇప్పుడంటే డైనింగ్‌ టేబుల్‌ అనే సంప్రదాయం కొనసాగుతోంది కానీ అప్పట్లో ఇంట్లో వాళ్లంతా హాయిగా నేల మీద కూర్చుని భోజనం చేసేవాళ్లు. దీనివల్ల పొట్టలో మూడింట రెండు వంతుల భాగం వంగుతుంది. ఫలితంగా మన ఉదరం నాలుగు లీటర్ల నీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది.
లా ఆఫ్‌ థెర్మోడైనమిక్స్‌ సూత్రం ఇక్కడ పనిచేస్తుంది. బ్యాడ్ ఫ్యాట్ దూరమవుతుంది. ఊబకాయం తగ్గుతుంది. కాబట్టి, పద్మాసనం వేసుకుని భోజనం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మన గట్ హెల్తీగా ఉంటుంది. మనం హెల్తీగా ఉంటాం.