
గోధుమలు, మక్కజొన్న, రాగి వంటి రకరకాల పప్పులు, తృణధాన్యాలు, బార్లీ, పెసర, శనగ, పల్లీ, బటానీ, సోయాబీన్ వంటి వాటిని మొలకలుగా తినడం చూస్తుంటాం. ఆల్ఫాల్ఫాన్ మొలకలన్నిటిలో రారాజు. ఇందులో అత్యధిక స్థాయిలో మినరల్స్, ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. మొలకలు తయారు చేసుకోవడం చాలా సులువు. మనం ఎంచుకున్న గింజలను శుభ్రమైన నీరున్న పాత్రలో ముందుగా నానబెట్టాలి. అది కూడా తగినంత గాలి పోయే విధంగా ఏర్పాటు చేసి మూతపెట్టాలి. దాదాపు 8 నుంచి 12 గంటల తర్వాత.. నీటిని మొత్తం ఒంపేస్తే సరి.. మొలకలు సిద్ధం. ఇక పోషక విలువలు నేరుగా అందాలంటే మొలకలను పచ్చిగానే తీసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు..
మొలకలు చేసే మేలు ఎంతంటే..
శక్తి తగ్గుదల: 5 %
కార్బొహైడ్రేట్ల తగ్గుదల: 5 %
ప్రొటీన్ల పెరుగుదల: 30 %
క్యాల్షియం పెరుగుదల: 35%
పొటాషియం పెరుగుదల: 80 %
సోడియం పెరుగుదల: 700%
ఐరన్ పెరుగుదల: 40%
ఫాస్ఫరస్ పెరుగుదల: 55 %
విటమిన్-ఎ పెరుగుదల: 300 %
థయమిన్ (విటమిన్-బి1) పెరుగుదల: 200 %
రిబోఫ్లోవిన్ (విటమిన్- బి2) పెరుగుదల: 500 %
నియాసిన్ (విటమిన్ -బి3) పెరుగుదల: 250 %
ఎస్కార్బిక్ యాసిడ్ (విటమిన్- సి) పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది.