
వంటింట్లో ఏదో మూలన ఉండి.. ఎప్పుడో కానీ వంటల్లో వేయం. అదే ఇంగువ.. సాంబార్, పులిహోర వంటి వంటల్లో ఆహారపు రుచిని అమాంతం పెంచుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు బేసిక్ గా అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వాటి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగిన ఇంగువ బాడీ పెయిన్స్ ను కూడా తగ్గిస్తుంది. ఇతర ప్రయోజనాలేంటంటే..
- ఇంగువలో ఉండే ఔషధ గుణాలు కడుపుబ్బరం సమస్యకు విరుగుడుగా పనిచేస్తాయి. చాలా సందర్భాల్లో కడుపునొప్పికి కారణం గ్యాస్, కడుపుబ్బరం సమస్యలే అయితే చిటికెడంత ఇంగువను పరగడుపున తీసుకుంటే కాస్త ప్రయోజనకారిగా పనిచేస్తుంది.
- ఇది శరీరంలో బ్లడ్ క్లాట్స్‌ను నివారించి.. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రోజూ పొద్దునే ఇంగువ కలిపిన నీళ్లు తాగితే రక్తపోటు అనేది నియంత్రణలోకి వస్తుంది.
- పరగడుపునే ఇంగువ తీసుకోవడం వల్ల తలనొప్పి బాధ నుంచి రిలీఫ్ పొందుతారు. ఇంగువలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పినీ తగ్గించడంలో సాయపడుతుంది. కాకపోతే ఆయుర్వేదం లేదా అలోపతి ఏ విధానంలో అయినా దీన్ని ప్రత్యేక అవసరాల కోసం వాడినప్పుడు డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే తీసుకోవడం మేలు.