అవిసె గింజలతో.. కీళ్ల ఆరోగ్యం..!

Flax seeds

కరోనా తర్వాత, ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో.. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. తీసుకునే ఆహారంలో సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవడం, ఫ్రెష్ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటివి హెల్తీగా ఉండటంలో సాయపడతాయి. ఇలా తృణధాన్యాలలో ముఖ్యంగా చెప్పాల్సి వస్తే అవిసె గింజలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకుందాం. ఇందులో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, కొవ్వులు, కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటివి ఉన్నాయి.

  • ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాన్స్ ఎక్కువగా ఉండటం వల్ల బోన్ స్ట్రెంత్ ను పెంచుతాయి. కీళ్లు అరిగిపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలకు ఈ గింజలు చక్కని పరిష్కారం.
  • ఇందులో ఉండే లినోలెనిక్ యాసిడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.
  • ఎముక నష్టం, బోలు ఎముక వ్యాధిని సైతం క్రమంగా తగ్గిస్తుంది.
  • అవిసెల్లో అల్ఫాలీనో లెనిక్ యాసిడ్ నిండి ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్ మలబద్దకం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, లూపస్ ఉన్నవారిలో మూత్రపిండాల వాపు తగ్గిస్తుంది.
  • ఇందులోని అధిక ఫైబర్ కారణంగా అవిసె గింజలను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది. *అవిసెలను తిన్న తర్వాత నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. దీనివల్ల ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడవు, వెగటుగా అనిపించదు.
  • ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈస్ట్రోజెన్ తగ్గినపుడు మహిళల్లో పిరియడ్స్ సమయంలో ఎముకలు బలహీనం అవుతాయి. ఫలితంగా తిమ్మిరి, నొప్పి వంటి వాటిని తగ్గించడంలో సహకరిస్తుంది.
  • బరువు తగ్గాలనుకునే వారికి తేలిగ్గా తీసుకోగలిగే ఆహారంగా చెప్పవచ్చు.
  • అవిసె గింజల్లో ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది.
  • కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వేయించిన అవిసె గింజలను తీసుకుంటే సరిపోతుంది.
  • పాలతో చేసిన ఓట్స్‌లో అవిసె గింజలను కలిపి తీసుకోవచ్చు లేదా చట్నీ చేసుకుని తినవచ్చు. *
  • ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యతకు అనువుగా ఉండే అవిసెలను తీసుకోవడం అలవాటుగా చేసుకుంటే కొన్ని రకాల నొప్పి ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు.