
ముఖానికి కాంతినిచ్చే సహజమైన వాటిల్లో పండ్లు ఎంతో ముఖ్యమైనవి. పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్లే.. పండ్లతో వేసే ఫేస్ ప్యాక్ లు ముఖానికి అందాన్ని, సహజత్వాన్ని ఇస్తాయి. ఈ కివిలో ముఖ్యంగా విటమిన్ సి, ఇ, కె తోపాటు అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
కివి ప్యాక్ లు: పండిన కివి పండును తీసుకోవాలి. ఇందులో టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు మాస్క్ లా వేసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచి శుభ్రం చేస్తే సరి.
- పండిన కివీ పండులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి, మెత్తగా చేయాలి. ముఖం, మెడకు మాస్క్ రూపంలో అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. అలాగే ఉంచాలి. ఈ ప్యాక్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- పండిన కివీ పండు, దోసకాయ ముక్కను పేస్ట్ లా చేసి 20 నిమిషాలు అలాగే ఉంచి, శుభ్రం చేసుకోవాలి.
- కివీ ఫేస్ ప్యాక్ చర్మం రూపాన్ని, ఆకృతిని బెటర్ గా మార్చేస్తుంది.
- మొండి మొటిమలను తగ్గిస్తుంది.
- చర్మాన్ని తేమగా, కాంతివంతంగా మారుస్తుంది. వివిధ చర్మ సమస్యలను నివారించడంలో ఇది సాయపడుతుంది.
- డార్క్ స్పాట్స్ తో కూడిన హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది.
- కివి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంతో పాటు హైడ్రేట్ గా ఉంచుతుంది.
- చర్మం కాంతివంతంగా మారేందుకు, కొన్ని రకాల అలెర్జీల నుంచి తప్పించుకునేందుకు కివీ పండు చాలా బాగా హెల్ప్ చేస్తుంది.