
సంపూర్ణ పోషకాలతో ఉండే సలాడ్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెబుతుంటారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీకు ఆన్‌లైన్‌లో ఎక్కడైనా లభిస్తాయి. కానీ పసందైన సలాడ్ తయారీ ఇలా చేసుకుందాం:
కావాల్సినవి..
మిరియాలు, పల్లీలు, తురిమిన క్యాబేజీ, కొత్తిమీర, కరివేపాకు, దానిమ్మ, నిమ్మ, తేనె, ఎండుద్రాక్ష, శొంఠి, పచ్చిమిర్చి, పిస్తాపప్పు, ఖర్జూరం, తురిమిన కొబ్బరి, వాల్‌నట్, బాదం మొదలైనవి వేసి సలాడ్ లా ప్రిపేర్ చేసుకోవాలి.
మరో రకం సలాడ్…
తాజా కీరదోసకాయ, పెద్ద ఉల్లిపాయ, పల్లీలు, మొలకెత్తిన పెసలు, శొంఠి, కాప్సికం (ఎరుపు/ ఆకుపచ్చ), ఆలివ్ ఆయిల్ కలిపితే సలాడ్ రెడీ.
తినే ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందించే ఔషధంలా భావించాలి. సరైన పోషక విలువలతో కూడిన పదార్థాలను తినేందుకు మొగ్గు చూపాలి.
అప్పుడే మనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీనివల్ల మెడిసిన్ మందులను ఆహారంగా తీసుకోవలసిన దుస్థితి నుంచి బయటపడతాం. ఈ సత్యాన్ని గ్రహించి ఆహారంలో తగిన మార్పులు చేర్పులు చేసుకుంటే చాలు.