ఎన్నో వ్యాధులకు దివ్యౌషధం.. మునగాకు!

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన వృక్షాల్లో మునగ చెట్టు ఒకటి. ఎంతో ఇష్టంగా తినే మునగకాయల వల్ల టేస్టీ రెసిపీస్ తో పాటు హెల్త్​ బెనిఫిట్స్​ ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. ఆయుర్వేద అధ్యయనాల ప్రకారం, మునగాకుల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఔషధంలా మారి ప్రయోజనాలను కలిగించే లక్షణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మునగ 300 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేస్తుందని ప్రాక్టికల్ గా రుజువైంది. దీని ఆకులు, కాడలను కూరగాయలుగా ఉపయోగిస్తారు. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న మునగ.. రక్తంలో షుగర్​ లెవల్స్​ను కంట్రోల్ చేస్తుంది. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్- ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా- కెరోటిన్, ఎమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉండటం విశేషం!

  • మునగ ఆకులు సహజంగా విటమిన్ Cని కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
  • మునగాకులోని ఔషధ గుణాలు జుట్టు రాలడం, ఉబ్బసం, కీళ్లనొప్పులు వంటి సాధారణ వ్యాధులను రిపేర్ చేయడంలో ఉపయోగపడతాయి.
  • ఈ ఆకులు ఒబెసిటిని తగ్గించడం, వెయిట్ లాస్ అవ్వడంలో సహాయపడతాయి.
  • డయాబెటిస్‌తో బాధపడేవారికి గొప్ప ప్రయోజనకారి. పరిగడుపున ఈ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
  • మునగాకులు ఎముకలకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియంలను అందిస్తాయి.
  • ప్రతిరోజూ మునగాకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా మూత్రం ద్వారా ఎలిమినేట్ అవుతుంది.
  • కడుపు నొప్పి, అల్సర్ వంటి అనేక కడుపు సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు.
  • ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచి, ఆరోగ్యకరమైన ప్రేగు కదలికకు దోహదపడుతుంది.
  • ఇది రక్తహీనతను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. అంటే ఎర్ర రక్తకణాల లోపాన్ని నివారిస్తుంది. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే, పాలు పెరుగుతాయి.
  • గుప్పెడు మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడికించి.. ఆ నీరు చల్లారిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు వంటివి తగ్గుతాయి.
  • మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోయి.. ముఖం మరింత అందంగా తయారవుతుంది.
  • ఇంకెందుకు లేటు.. వెళ్లి మునగాకును తినండి. ఆరోగ్యాన్ని పొందండి.