తెల్లటి పదార్థాలను కాస్త తగ్గించండి..!

మనం రెగ్యులర్ గా ఆకుకూరలు.. కాయగూరలు తింటూ ఉంటాం. ఎలా తిన్నా.. మనం
వెరైటీగా తినడానికే ఇష్టపడతాం. రకరకాల కాయగూరలతో ఆహారాన్ని కలర్ ఫుల్ గా చేసుకొని తినడం వల్ల తినే ఫుడ్ మిద ఇంట్రెస్ట్, ఇష్టం పెరుగుతుంది.
అయితే అందులోనూ కొన్ని మేలు చేస్తే.. కొన్ని అనర్థాలకు అదే అనారోగ్య సమస్యలకు మూలం అవుతాయి. అలాంటి వాటిలో ఏడు రకాలైన తెల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం:

చక్కెర, ఉప్పు, పాస్తా, మైదా, చక్కెరలు జోడించిన పాలు వాటి పదార్థాలు, బాగా మరపట్టిన బియ్యం, ఆలుగడ్డ చిప్స్‌..
అవును ఇవి మనం రెగ్యులర్ గా.. ఇష్టంగా తింటూ ఉంటాం.
ప్రముఖ క్రీడాకారులు, యాక్టర్స్, ఇతర సెలెబ్రిటీలు ఎక్కువ కార్బొహైడ్రేట్లు కలిగిన పాలిష్డ్‌ బియ్యానికి దూరంగా ఉంటారు. వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు.
కానీ మనం డైట్ ఫుల్ గా తినకపోయినా పర్వాలేదు.. కానీ ఏది ఎంత మోతాదులో తినాలో..
ఎంత లిమిట్ లో తినాలనేది తెలిసి ఉండాలి.
ఎప్పుడైనా సరే మితంగా తింటే ఆహారం ఆరోగ్యమవుతుంది. అన్ లిమిటెడ్ గా తీసుకుంటే అదే ఆహారం విషమవుతుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో కృత్రిమ చక్కెరలు, ఉప్పు నిండిన ఆహార పదార్థాలకు, ప్రాసెస్డ్ ఫుడ్ కు కాస్త దూరంగా ఉంటే మంచిది.