
వేసవి కాలంలో అందరూ ఇష్టంగా తినే పండ్ల జాబితాలో ఖర్భుజా ఒకటి. దీనిని స్వీట్ మెలోన్ లేదా రాక్ మెలోన్ అని అంటారు. హిందీ, మరాఠీ, తెలుగులో దీనిని ‘ఖర్బూజా’గా పిలుస్తారు. తమిళంలో దీనిని ‘ములం పజం’ అని, బెంగాలీలు ‘ఖర్ముజ్’ అని, గుజరాతీలు ‘షకర్టెట్టి’ అని పిలుస్తారు. ప్రాంతాలు, పేర్లు ఎన్ని మారినా ఈ ఖర్భూజా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.
- ఖర్భూజాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ ను నిరోధించడంలో, క్యాన్సర్ కణాలతో పోరాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.
- ఇది తెల్ల రక్త కణాలను (WBC) బిల్డ్ చేస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇవి సాధారణంగా బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది.
- మెరిసే చర్మం కోసం, ఖర్భూజా, పుదీనా కాంబినేషన్ లో జ్యూస్ ట్రై చేయవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. చక్కెర లేకుండా ఈ జ్యుస్ తీసుకుంటే మరింత మంచిది.
- బరువు తగ్గాలనుకునేవారికి ఈ ఖర్భూజా బెస్ట్ ఆప్షన్. ఇది నోటికి, కడుపుకు కూడా తృప్తిని ఇస్తుంది. దీనివల్ల బరువు పెరగరు.
- కేవలం ఇదొక్కటే కాకుండా దీనితో పాటు ఇతర పండ్లను భాగం చేసుకుని ఫ్రూట్ సలాడ్ గా తీసుకోవచ్చు.
- తరచుగా నోటి అల్సర్స్, నమలడంలో ఇబ్బంది ఉన్నవారు ఖర్భుజాతో రిలీఫ్ పొందుతారు. “ఖర్భూజా పండులో కొవ్వులు ఉండవు. ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మంటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
- శరీరానికి సరిపడా మెగ్నీషియం ఇందులో లభిస్తుంది.
- ఇది హృదయ స్పందనను సక్రమంగా ఉంచుతుంది.
- ఎక్కువ శాతం నీటితో నిండిన ఖర్భూజాలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. జీర్ణాశయానికి చాలా మంచిది.
- శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
- అసిడిటీ సమస్య ఉన్నవారికి ఖర్భూజా చక్కని ఔషధంలా పనిచేస్తుంది.
- ఖర్భూజా కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడంలో సాయపడుతుంది.
- ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఖర్భూజా తీసుకుంటే ఆకలిని నియంత్రిస్తుంది. ఈ ట్రిక్ బరువు అదుపులో ఉంచుకోవాలి అనుకునేవారికి ఇది బెస్ట్.