ఎర్ర ద్రాక్ష.. ఆరోగ్యానికి రక్ష..!

ద్రాక్ష ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనది. దీని రుచి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్షలో అనేక రకాలున్నాయి. ఎరుపు, నలుపు, ఆకుపచ్చ అంటూ.. గ్రీన్, బ్లాక్ ఎక్కువగా తింటున్నాం. కానీ ఎర్ర ద్రాక్ష వీటిలో కాస్త ప్రత్యేకం. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి కావాల్సిన చాలా ముఖ్యమైన పోషకాలను అందేలా చేస్తాయి.

  • ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలతో పాటు జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.
  • కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎర్ర ద్రాక్ష మంచి ఆప్షన్. ఇది ఒత్తిడి, కళ్ల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటిశుక్లం రాకుండా చేస్తుంది.
  • బీపీ కూడా అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు గుండెను వ్యాధుల నుంచి రక్షించేందుకు పని చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • ఎర్ర ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
  • ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.
  • కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఆహారంలో ఎర్ర ద్రాక్షను చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది జ్ఞాపకశక్తిని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.