పుచ్చకాయ తినడంలో ఈ పొరపాట్లు చేయొద్దు..!

చిన్నా పెద్దా తేడా లేకుండా పుచ్చకాయను ఇష్టపడనివారు ఉండరు. ఇందులో అధికశాతం నీరు ఉండటంతో పుచ్చకాయ తింటే వేసవి వేడిని అధిగమించవచ్చు. అయితే పుచ్చకాయను తినడంలో చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. ఇలా పొరపాటుగా తినడం వల్ల పుచ్చకాయ శరీరానికి మంచి చేయకపోగా, చెడు చేస్తుంది అంటున్నారు ఆహార నిపుణులు. పుచ్చకాయలో దొరికే విటమిన్లు, పోషకాలు, ఉపయోగాల గురుంచి తెలుసుకుందాం:

  • పుచ్చకాయలో అధిక మొత్తంలో సహజ చక్కెర, నీరు ఉంటాయి. ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటి, జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి ముందుగా తేలికపాటి అల్పాహారం తీసుకున్న తరువాతే పుచ్చకాయ తినాలి.
  • చాలామంది భోజనం తర్వాత పండ్లు తింటూ ఉంటారు. ఇలా భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. భోజనం చేసిన కనీసం గంట తర్వాత పుచ్చకాయ తినడం మంచిది.
  • చల్లటి పుచ్చకాయ రుచిగా ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే తినడం వల్ల గొంతు నొప్పి, జలుబు వస్తుంది. మొదట గది ఉష్ణోగ్రత వద్ద కొంత సమయం ఉంచిన తర్వాత తినాలి. తక్కువ పరిమాణంలో పుచ్చకాయ తినాలి. ఒకేసారి ఎక్కువగా తినకూడదు. శరీరం దానిని సరిగ్గా జీర్ణం చేసుకునేలా చిన్న చిన్న ముక్కల్ని తినాలి.
  • చాలామంది పుచ్చకాయలో ఉప్పు వేసి తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇలా తింటే మరింత స్వీట్, జ్యూసీగా ఉంటుంది. కానీ అది ఆరోగ్యానికి హానికరం అని తెలియదు. ఇది శరీరంలో సోడియం మొత్తాన్ని పెంచడం వల్ల అధిక రక్తపోటును పెంచుతుంది. ఇప్పటికే అధిక రక్తపోటు సమస్య ఉంటే పుచ్చకాయతో ఉప్పు తినడం పూర్తిగా మానేయాలి.
  • ఎల్లప్పుడూ తాజాగా ఉన్న పుచ్చకాయను, ఇంట్లో నిల్వ చేయకుండా అప్పటికప్పుడు కట్ చేసుకుని తినాలి. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల తరచుగా మూత్రవిసర్జన, కడుపులో భారంగా అనిపించవచ్చు. ఎల్లప్పుడూ పుచ్చకాయను ఒకదాన్నే తినాలి. ఇతర పండ్లతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.