
పాయసం, రుచికరమైన స్వీట్ల నుంచి స్పైసీగా చేసుకునే బిర్యానీ వరకూ అన్నింట్లో నెయ్యి ఉండాల్సిందే. నెయ్యి ఎందులో వేసినా సరే ఆ టేస్ట్ వేరే లెవల్ లో ఉంటుంది. అయితే నెయ్యిలో ఆహార రుచిని పెంచే గుణాలే కాకుండా అందులో అనేక ఔషధ లక్షణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని, ఎముకల దృఢత్వాన్ని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో పరగడుపున ఒక టీస్పూన్ నెయ్యి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఇప్పుడు చూద్దాం:
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినడం మంచిది. ఇందులో ఉన్న ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడానికి సహాయపడతాయి.
జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
- ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు రావు. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఆయుర్వేద ప్రకారం పేగుల్లోని జీర్ణ ఎంజైమ్‌లను నెయ్యి ప్రేరేపిస్తుందట.
- నెయ్యి ఎముకల బలాన్ని పెంచుతుంది. నెయ్యిలో ఉన్న స్టార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కీళ్ల వాపును తగ్గిస్తాయి.
- నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు కాలేయంలో కీటోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయని, దీనివల్ల శక్తి లభించడంతోపాటు గ్లూకోజ్‌పై ఆధారపడడం తగ్గుతుంది.
- నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ అనేది శోషరస వ్యవస్థను ప్రేరేపిస్తుందట. దీనివల్ల రోగనిరోధక పనితీరు మెరుగుపరడంతో పాటు వ్యాధికారకాల నుంచి రక్షణ కల్పిస్తుంది.
- పరగడుపునే నెయ్యి తినడం వల్ల అంటువ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.
- ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి అలానే నెయ్యికి కూడా వర్తిస్తుంది.
- కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు నెయ్యికి దూరంగా ఉండాలి. గ్యాస్, అజీర్ణం లేదా ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారిలో నెయ్యి జీర్ణం కాకపోవచ్చు.
- లివర్ వ్యాధులతో బాధపడుతున్నవారు నెయ్యిని తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే నెయ్యి సరిగా జీర్ణం కాదు.
- నెయ్యి తినడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు, ఫ్లూతో బాధపడేవారు నెయ్యి తినడం అంత మంచిది కాదు.