
మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే ప్రోటీన్లు ఇందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది ఈ సమ్మర్ లో మనం తినే బ్రేక్ ఫాస్ట్ లో వీటినీ తప్పక ఉండేలా చూసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.. అవేంటంటే…
బొప్పాయి: ఇందులో ప్రోటీన్లు, పీచు పుష్కలంగా లభిస్తాయి. ఉదయం అల్పాహారంగా ఈ పండును తీసుకుంటే ప్రొటీన్లు బాగా అందుతాయి. అంతేకాక జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను బయటకు పంపి, హెల్తీగా ఉంచుతుంది.
పుచ్చకాయ: ఇందులో 90 శాతం నీరే ఉంటుంది. కాబట్టి పొద్దున తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల రోజుకు సరిపడా మినరల్స్, ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. ఆపై ఇన్స్టాంట్ ఎనర్జీ లభిస్తుంది.
బాదంపప్పు: డ్రైఫ్రూట్స్ లేదా నట్స్ అన్నిటిలో మేలైంది బాదంపప్పు… రాత్రిపూట నీళ్లలో నానబెట్టిన బాదంపప్పును ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. అలాగే ఉదయం పూట ఓ పిడికెడు బాదంపప్పును తీసుకుంటే చాలు.
కూరగాయల రసం/ వెజిటేబుల్ సూప్: ప్రతిరోజు ఉదయం కూరగాయల రసం తాగితే కూడా చాలా మంచి జరుగుతుంది. క్యారెట్, బీట్ రూట్, కీరదోస, టమాట, సొరకాయ, బీరకాయ వంటి కూరగాయలను అన్నింటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే, శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి, ఆరోగ్యం ఇంకాస్త మెరుగవుతుంది.