
Ceasefire between Israel and Iran: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల పాటు సాగిన హై-వోల్టేజ్ యుద్ధం సీజ్‌ఫైర్‌తో ముగిసిందా? ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి స్థాపకుడిగా సక్సెస్ అయ్యారా? జూన్ 13 నుంచి మొదలైన ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్‌ను కుదిపేసింది. ట్రంప్ సీజ్‌ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా రెండు దేశాలు దాడులు చేసుకున్నాయి. అసలు సీజ్ ఫైర్ వెనుక కథ ఏం జరిగింది? ఇప్పుడు ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలా..?
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఎట్టకేలకు ఉద్రిక్తతలు చల్లారాయి. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌లోని మిలిటరీ, అణు స్థావరాలపై భారీ ఎయిర్‌స్ట్రైక్ చేసి యుద్ధాన్ని మొదలు పెట్టింది. ఇరాన్ దీనికి ప్రతికారంగా దాడులు జరిపింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అంటూ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ ఫ్యూయల్ ప్రొడక్షన్ సెంటర్లు, ఎనర్జీ సప్లై సెంటర్లపై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి చేసింది. ఈ దాడులు ఇరాన్‌లోని సెంట్రిఫ్యూజ్ ప్రొడక్షన్ సైట్‌ను టార్గెట్ చేశాయి. ఇజ్రాయెల్‌లోని బీర్ షెబా నగరంలో ఇరాన్ మిస్సైల్ దాడిలో నలుగురు చనిపోయారు. ఇరాన్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 606 మంది మరణించారని ఇరాన్ హెల్త్ మినిస్ట్రీ చెప్పింది, కానీ ఇండిపెండెంట్ గ్రూప్స్ ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని అంటున్నాయి. ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. అమెరికా కూడా ఈ యుద్ధంలోకి దిగింది. జూన్ 22న ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ అంటూ ఇరాన్‌లోని మూడు కీలక అణు స్థావరాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై బాంబులు వేసింది. ఇరాన్ దీనికి రిటాలియేట్ చేస్తూ ఖతార్‌లోని అమెరికా ఎయిర్ బేస్ పై మిస్సైల్స్ వదిలింది. ఈ దాడులు యుద్ధాన్ని మరింత ఉధృతం చేశాయి.
ఉద్రిక్తతల మధ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీజ్‌ఫైర్ ప్రకటించారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి సీజ్‌ఫైర్ ఒప్పందం జరిగింది. 12 రోజుల యుద్ధం అధికారికంగా ముగిసింది అని పోస్ట్ చేశారు. ఈ సీజ్‌ఫైర్‌ను ఖతార్ ప్రధాని మధ్యవర్తిత్వంతో సాధించారు. ట్రంప్ ఖతార్ ఎమీర్‌తో మాట్లాడి, ఇజ్రాయెల్ ఒప్పుకున్నట్టు చెప్పి, ఇరాన్‌ను కూడా ఒప్పించమని అడిగారు. ఇరాన్ మొదట ఎలాంటి ఒప్పందం లేదు అని చెప్పినా, తర్వాత వాళ్ల విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ఇజ్రాయెల్ దాడులు ఆపితే, మేం కూడా ఆపేస్తాం అని సిగ్నల్ ఇచ్చారు. సీజ్‌ఫైర్ మంగళవారం ఉదయం 7:30 గంటలకు అమల్లోకి వచ్చింది. ఇరాన్ మొదట సీజ్‌ఫైర్ పాటిస్తుంది, 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా దాడులు ఆపేస్తుంది, 24 గంటల్లో యుద్ధం పూర్తిగా ముగుస్తుంది అని ట్రంప్ ప్రకటించారు. కానీ, సీజ్‌ఫైర్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
సీజ్‌ఫైర్ అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ మాత్రం తాము ఎలాంటి దాడులూ చేయలేదు అని చెప్పింది. ఇజ్రాయెల్ రిటాలియేట్ చేస్తూ టెహ్రాన్ సమీపంలో రాడార్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. ఇది సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని వైలేట్ చేసినట్టు అనిపించింది. ట్రంప్ ఈ రెండు దేశాలపై ఫైర్ అయ్యారు. ఇజ్రాయెల్, ఇరాన్ రెండూ సీజ్‌ఫైర్‌ను బ్రేక్ చేశాయి. ఇజ్రాయెల్ బాంబులు వేసింది, ఇరాన్ కూడా మిస్సైల్స్ పంపింది. ఈ రెండు దేశాలకు ఏం చేస్తున్నాయో తెలీదు అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత, ఇజ్రాయెల్ తదుపరి దాడులు ఆపేసింది. ఇజ్రాయెల్ విమానాలు వెంటనే ఇరాన్ ను విడిచి వెళ్లాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్‌ను పాటిస్తే, తాము కూడా పాటిస్తాం అని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియన్ చెప్పారు. Ceasefire between Israel and Iran.
అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారన్న ప్రశ్నకు సమాధానం క్లియర్‌గా లేదు. తాము ఇరాన్ అణు సామర్థ్యాన్ని, మిలిటరీ లీడర్‌షిప్‌ను, బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్‌ను బాగా డ్యామేజ్ చేశాం అని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్ అణు స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి అని ట్రంప్ చెప్పారు, అయితే డ్యామేజ్ అసెస్‌మెంట్ ఇంకా పూర్తి కాలేదు అని అమెరికా అధికారులు అంటున్నారు. ఇరాన్ మాత్రం తమ అణు స్థావరాలు సేఫ్‌గా ఉన్నాయి, తాము ఇజ్రాయెల్, అమెరికాకు గట్టిగా బదులిచ్చాం అని చెప్పుకుంటోంది. ఇరాన్ అమెరికా బేస్‌పై దాడి చేసినప్పుడు ముందుగా వార్నింగ్ ఇచ్చింది, దీనివల్ల అమెరికా సైనికులు ఎవరూ చనిపోలేదు. ఈ మూడు దేశాలూ తమ ప్రజలకు తామే గెలిచాం అని చెప్పుకుంటున్నాయి. ట్రంప్ శాంతి స్థాపకుడిగా సక్సెస్ అయ్యారా అంటే, ఆయన సీజ్‌ఫైర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ, సీజ్‌ఫైర్ తర్వాత కూడా దాడులు జరిగాయి కాబట్టి, ఈ శాంతి ఎంతకాలం నిలుస్తుందన్నది ప్రశ్న. ట్రంప్ ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్‌ను నాశనం చేసేది, కానీ తాము ఆపేశాం అని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ద్వైపాక్షిక చర్చలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది, దీనికి ట్రంప్ స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్‌కాఫ్ నాయకత్వం వహిస్తారు. అయితే, ఈ సీజ్‌ఫైర్ చాలా ఫ్రాజైల్‌గా ఉందని, ఇరాన్‌లో అణు కార్యక్రమంపై మళ్లీ రెచ్చిపోతే యుద్ధం తిరిగి మొదలయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: https://www.mega9tv.com/international/russia-an-ally-of-iran-is-trying-to-broker-a-peace-deal/