
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్…అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ల బంధానికి బీటలు ఏర్పడుతున్నాయా? అధ్యక్ష్యుడిగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మస్క్ కి రుచించడం లేదా? ఇన్నాళ్లు దోస్త్ మేరా దోస్త్ అంటూ వెనకేసుకొచ్చిన మస్క్ ని ట్రంప్ పట్టించుకోవడం లేదా? అంటే అవుననే అనిపిస్తుంది ప్రస్తుతం పరిస్థితులు గమనిస్తే. రీసెంట్ గా డోజ్ నుంచి మస్క్ తప్పుకోవడం.. అంతకు ముందు ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా గళం విప్పడం.. ఇక ఇప్పుడు తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై విరుచుకుపడటంతో మస్క్, ట్రంప్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ట్రంప్ తీరుతో అమెరికా దివాళా తీయడం ఖాయం అంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ప్రపంచ కుభేరుడికి..అమెరికా అధ్యక్ష్యుడికి మధ్య ఏం జరుగుతోంది? మస్క్ మాటల వెనుక మర్మం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా అమెరికా సెనెట్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను ప్రవేశపెట్టారు. ఇది రెమిటెన్స్‌లపై అంటే అమెరికా నుంచి విదేశాలకు డబ్బులు పంపించడంపై 3.5 శాతం ఎక్సైజ్ సుంకం విధించే బిల్లు. ఇది అమెరికాకు వలస వెళ్ళిన ప్రతీవారికీ వర్తిస్తుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా, H1B వీసాపై అక్కడికి వెళ్లి వర్క్ చేస్తున్న ప్రతి ఇమ్మిగ్రెంట్ కు ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. ఈ బిల్లు ప్రభావం దాదాపు 4 కోట్ల మంది వలసదారులపై ఉంటుందని అంచనా. ఇప్పటికే ఈ బిల్లుకు అమెరికా సెనేట్ లో ఒక్కరు తప్ప మొత్తం అందరూ ఆమోదం తెలిపారు. కానీ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్ మాత్రం ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డోజ్ నుంచి బయటికి రాక ముందు నుంచి ఈ బిల్లు పై మస్క్ తన వ్యతిరేకంగా గళం వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై విరుచుకుపడ్డారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒక చెత్త బిల్లు అని మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు కారణంగా అమెరికన్లపై అధిక భారం పడుతుందని ఎక్స్ లో పోస్ట్ పెట్టి ట్రంప్ పై ఆరోపణలు చేశారు. దయచేసి నన్ను క్షమించండి… నేను ఇంతకంటే భరించలేను…ఇది అత్యంత దారుణమైన బిల్లు ..ఇది చాలా పెద్ద తప్పు అని నాకు తెలుసు అంటూ పోస్ట్ లో బిల్లుపై విరుచుకుపడ్డారు. అందులోనూ ఈ చెత్త బిల్లుకు మొత్తం సెనేట్ ఓటు వేసిందంటే అది ప్రభుత్వానికే తీవ్ర అవమానం అని మస్క్ విమర్శించారు. దీనికి ఓటు వేసిన వారంతా సిగ్గుపడాలన్నారు. ఈ ఒక్క బిల్లు కారణంగా వచ్చే 10 ఏళ్లలో ద్రవ్యలోటు 2.5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్లపై భరించలేనంత భారం పడుతోందన్నారు.అమెరికా దివాలా తీయడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇదిలా ఉంటే డోజ్ చీఫ్‌గా ఉన్నప్పుడు మస్క్ ఈ బిల్లు తన ఖర్చు తగ్గింపు ప్రయత్నాలను దెబ్బతీసిందని మాత్రమే మస్క్ విమర్శించారు. కానీ ఇప్పుడు ఈ బిల్లు అమెరికన్ పౌరులపై అసాధ్యమైన రుణభారాన్ని మోపుతుంది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎలాన్ మస్క్ కామెంట్స్ పై వైట్ హౌస్ రియాక్ట్ అయింది. ఆయన చేసిన కామెంట్స్ ను వైట్‌హౌస్ ఖండించింది. ఈ బిల్లుపై మస్క్ అభిప్రాయం ఏంటనేది అధ్యక్షుడు ట్రంప్‌నకు ముందే తెలుసని ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ చెప్పారు. ఇది ట్రంప్ అభిప్రాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చదన్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చాలా గొప్పదని, ట్రంప్ ఈ బిల్లు ప్రవేశపెట్టేందుు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉంటే ట్రంప్ కు వ్యతిరేకంగా గళం విప్పిన మస్క్‌కు రిపబ్లికన్ల నుంచి సపోర్ట్ లభిస్తోంది. మస్క్ చెప్పింది నిజమేనని ఆ పార్టీకి చెందిన ప్రతినిధులు అంటున్నారు.
ఎన్నికలకు ముందు నుంచి కలిసిమెలిసి తిరిగిన మస్క్, ట్రంప్ ఇప్పుడు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు ట్రంప్ తో కలిసి మస్క్ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కానీ ఇప్పుడు వారి బాండ్ వీక్ అయ్యింది. ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మస్క్ 2000 కోట్ల ఖర్చు చేశారు . తూహీ మేరా దోస్త్ అంటూ తన వెంటే నిలిచారు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మస్క్ 2 ట్రిలియన్ డాలర్లు ఆదా చేయాలనే లక్ష్యంతో డోజ్‌ను ప్రారంభించారు.కానీ డోజ్ మంత్రిత్వశాఖ నాలుగు నెలల కాలంలోనే వేలాది మంది ఉద్యోగాలను తొలగించింది. విదేశీ సహాయాన్ని కట్ చేసింది. ఇదే క్రమంలో ఇటీవల టెస్లా అమ్మకాలు తగ్గడం, స్పేస్‌ఎక్స్ రాకెట్ల విఫలమవ్వడం , కంపెనీలపై నిరసనలతో మస్క్‌పై ప్రెజర్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన డోజ్ నుంచి తప్పుకున్నారని సమాచారం. అంతే కాదు మస్క్, ట్రంప్ మధ్య బంధం పూర్తిగా దెబ్బతిన్నట్టు అర్థమవుతోంది. ఒక్కప్పుడు స్నేహితులుగా ఉన్న ఇద్దరు బిలియనీర్లు ఇప్పుడు బద్ద శత్రువులవుతున్నారు.