ఇవాళ ఇరాన్.. రేపు పాకిస్థానా..?

Trump Iran And Pakistan Consequences: ఇవాళ ఇరాన్.. రేపు పాకిస్థానా..? అమెరికాకు పాకిస్థాన్ కొత్త శత్రువు కాబోతోందా..? పాకిస్థాన్ రహస్యంగా తయారు చేస్తున్న ఓ ఆయుధం ఇప్పుడు అమెరికాకు ఆ దేశాన్ని దూరం చేయనుందా..? . అమెరికా నిఘా వర్గాలే ఈ విషయాన్ని బయటపెట్టాయా? అమెరికా దీన్ని ఎలా చూస్తోంది? ఈ ఆయుధం పాకిస్థాన్‌ను అమెరికాకు శత్రువుగా మార్చనుందా? ఇప్పటికే అణ్వాయుధం కలిగిన పాకిస్థాన్ అంతకు మించి ఏం తయారు చయగలదు..?

ఇప్పటి వరకు పాకిస్థాన్, అమెరికా మిత్రదేశాలుగానే ఉన్నాయి. భారత్ కు స్నేహాన్ని కొనసాగిస్తూ.. పాకిస్థాన్ ను నెత్తిన పెట్టుకుంటోంది అమెరికా.. చైనాతో పాకిస్థాన్ అంటకాగుతున్నా.. అమెరికా మాత్రం దాయాదిని ఏ మాత్రం మందలించదు. అయితే ఇప్పుడు అమెరికాకే పాకిస్థాన్ పక్కలో బల్లెంలా మారే పరిస్థితి వచ్చింది. పాకిస్థాన్ సైన్యం ఒక లాంగ్ రేంజే అణు క్షిపణిని తయారు చేస్తోంది. అది అమెరికా వరకు చేరే శక్తి కలిగి ఉందని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి – ఐసీబీఎం, దీని పరిధి 5,600 కిలోమీటర్లకు మించి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి క్షిపణులు కేవలం అమెరికా, రష్యా, చైనాల వద్ద మాత్రమే ఉన్నాయి. పాకిస్థాన్ ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగిస్తే, అమెరికాకు అది ఒక శత్రువుగా మారుతుందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణిని సాధిస్తే, వాషింగ్టన్‌కు దాన్ని అణు శత్రువుగా పరిగణించక తప్పదు అని అమెరికా నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది. ఈ క్షిపణి విజయవంతమైతే, పాకిస్థాన్ అణు సామర్థ్యం కేవలం భారత్‌తోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక పెద్ద ముప్పుగా మారుతుంది. Trump Iran And Pakistan Consequences.

పాకిస్థాన్ ఈ దీర్ఘ శ్రేణి అణు క్షిపణిని తయారు చేయడం వెనక ఉన్న ఉద్దేశాలు అమెరికాను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫారిన్ అఫైర్స్ నివేదిక ప్రకారం, పాకిస్థాన్ ఈ క్షిపణి ద్వారా అమెరికాను నేరుగా లక్ష్యంగా చేసుకోవచ్చు. ఐసీబీఎం సామర్థ్యం ఉన్న ఏ దేశాన్నైనా అమెరికా మిత్ర దేశంగా భావించదు అని అమెరికా అధికారులు హెచ్చరించారు. పాకిస్థాన్ ఈ క్షిపణి టెక్నాలజీని సాధిస్తే, అది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త శత్రుత్వాన్ని తెచ్చిపెడుతుంది. అమెరికా ఇప్పటికే పాకిస్థాన్ అణు సామర్థ్యంపై నిఘా ఉంచింది, కానీ ఈ కొత్త పరిణామం దాని ఆందోళనలను మరింత పెంచింది. పాకిస్థాన్ తో పైకి స్నేహంగా మెలిగినా.. ఆ దేశం ఉగ్రవాదులను ప్రోత్సహించే విధానం అమెరికాకు తెలుసు. భారత్ చెప్పినా చెప్పకపోయినా.. పాకిస్థాన్ తో ఎప్పటికైనా ముప్పే అని అమెరికాకు తెలుసు.. అందుకే ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది అమెరికా. కొన్ని వ్యూహాత్మక వ్యవహారాల నేపథ్యంలో పాకిస్థాన్ కు అమెరికా మద్దతు అందిస్తోంది. అయితే తమకే ముప్పు అని తెలిస్తే.. పాకిస్థాన్ ను అమెరికా విడిచి పెట్టదు. ముఖ్యంగా పాకిస్థాన్ క్షిపణి టెక్నాలజీ ఉగ్రవాదులకు చిక్కితే అది భారత్ తో పాటు అమెరికాకు తీవ్రముప్పే అని చెప్పాలి.

పాకిస్థాన్ ఈ దీర్ఘ శ్రేణి అణు క్షిపణిని అభివృద్ధి చేయడం భారత్‌కు కూడా ఒక పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ఈ క్షిపణి అమెరికాను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, దాని సామర్థ్యం భారత్‌పై కూడా ముప్పు తెచ్చిపెడుతుంది. పాకిస్థాన్ ఇప్పటికే 170 అణు వార్‌హెడ్‌లను కలిగి ఉందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక తెలిపింది. భారత్‌కు 180 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి, కానీ పాకిస్థాన్ ఈ కొత్త క్షిపణి ద్వారా తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్షిపణి భారత్‌పై దాడులకు ఉపయోగపడే అవకాశం ఉంది, ముఖ్యంగా భవిష్యత్ ఉద్రిక్తతలు ఏర్పడితే ఈ కొత్త క్షిపణులు ఉపయోగించొచ్చు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాకిస్థాన్ తన దగ్గర ఉన్న అణ్వాయుధాలను చూపించి భయపెట్టింది. కానీ భారత్ ఇందుకు భయపడలేదు. దీనికి ధీటుగా సమాధానం చెప్పింది.

పాకిస్థాన్ ఈ దీర్ఘ శ్రేణి అణు క్షిపణిని అభివృద్ధి చేయడం అంతర్జాతీయ సమాజంలో కలకలం సృష్టించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్థాన్ క్షిపణి కార్యక్రమంపై ఆందోళన వ్యక్తం చేసింది. 2020లో చైనా నుంచి బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత కోసం పరికరాలను రహస్యంగా తెప్పించే ప్రయత్నం జరిగిందని, ఇవి రవాణా అవుతోన్న షిప్ ను భారత కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారని ఎఫ్‌ఏటీఎఫ్ నివేదిక తెలిపింది. ఈ పరికరాలు పాకిస్థాన్ నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్‌కు సంబంధించినవని, అవి క్షిపణి తయారీకి ఉపయోగపడతాయని వెల్లడైంది. ఈ సంఘటన పాకిస్థాన్ అక్రమ కార్యకలాపాలను బయటపెట్టింది. చైనా సహకారంతో పాకిస్థాన్ ఈ క్షిపణి తయారు చేస్తోందని అనుమానం కలగేలా చేసింది. భారత్ ఈ సమాచారాన్ని ఉపయోగించి, పాకిస్థాన్‌ను మళ్లీ ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అలాగే, అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ అణు కార్యక్రమంపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ కోరుతోంది. పాకిస్థాన్ ఈ క్షిపణి ద్వారా అంతర్జాతీయ శాంతిని భంగం చేయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్థాన్ ఈ దీర్గ శ్రేణి అణు క్షిపణిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో, భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సిప్రి నివేదిక ప్రకారం, 2025 జనవరి నాటికి భారత్ 180 అణు వార్‌ఖెడ్‌లను కలిగి ఉంది, పాకిస్థాన్‌కు 170 ఉన్నాయి. భారత్ తన అణు ఆయుధ రవాణా వ్యవస్థలను ఆధునీకరిస్తోంది, ముఖ్యంగా కానిస్టరైజ్డ్ క్షిపణులపై దృష్టి పెడుతోంది, ఇవి ఎక్కువ వర్‌హెడ్‌లను మోసుకెళ్లగలవు. అలాగే, భారత్ తన హైపర్‌సోనిక్ క్షిపణి, ఎక్స్‌టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్‌సోనిక్ మిస్సైల్ ను అభివృద్ధి చేస్తోంది, ఇది బ్రహ్మోస్ కంటే మూడు రెట్లు వేగంగా, ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది. భారత్ ఈ చర్యల ద్వారా పాకిస్థాన్, చైనా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. అగ్ని-5 క్షిపణి, సబ్‌మెరైన్-లాంచ్డ్ బాంబలిస్టిక్ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం భారత్ సత్తాను చాటుతున్నాయి. పాకిస్థాన్ ఈ కొత్త క్షిపణి ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచాలని చూస్తున్నప్పటికీ, భారత్ తన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది.

Also Read: https://www.mega9tv.com/international/ceasefire-between-israel-and-iran-has-trump-become-a-peacemaker/